స్టార్ హీరోలకు కూడా ఇలాంటి బుకింగ్స్ లేదు.. దుమ్ములేపుతున్న 'ఈ నగరానికి ఏమైంది' రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్

ఈమధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ మన టాలీవుడ్ లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరో కొత్త సినిమా విడుదల అయ్యేటప్పుడు ఎంత హంగామా అయితే చేస్తారో.

 Vishwak Sen Ee Nagaraniki Emaindi Movie Re Release Advance Bookings Record Detai-TeluguStop.com

ఈ రిలీజ్ సినిమాల విషయం లో కూడా అలాగే చేస్తుంటారు.ప్రస్తుతం ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం గా పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రం( Kushi Movie ) నిల్చింది.

ఆ తర్వాత రీసెంట్ గా విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ ( Simhadri ) చిత్రం అత్యధిక వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిల్చింది.ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ ఆరెంజ్, పవన్ కళ్యాణ్ జల్సా మరియు మహేష్ బాబు ఒక్కడు చిత్రాలు టాప్ 5 లిస్ట్ లో కొనసాగుతున్నాయి.

ఈ సినిమాలన్నీ స్టార్ హీరోలవి కాబట్టి వాళ్ళ అభిమానులు చూస్తారు కాబట్టి అంత వసూళ్లు వచ్చాయి అని అనుకుందాం.

Telugu Eenagaraniki, Okkadu, Simhadri, Tharun Bhaskar, Tholiprema, Vishwak Sen-M

కానీ ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేని సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’( Ee Nagaraniki Emaindi Movie ) అనే చిత్రాన్ని ఎల్లుండి గ్రాండ్ గా మరోసారి రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గానే ప్రారంభించారు.తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో విశ్వక్ సేన్( Vishwak Sen ) హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద యూత్ ఫుల్ హిట్ గా నిల్చింది.

ఇప్పటికీ ఈ సినిమా ని బోర్ కొట్టినప్పుడల్లా ఓటీటీ లో చూస్తూనే ఉంటారు జనాలు.అలాంటి కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కించుకున్న ఈ సినిమాకి ఇప్పటికీ ఎంత క్రేజ్ ఉందో, ఒక్కసారి బుక్ మై షో యాప్ ని ఓపెన్ చేసి చూస్తే అందరికీ అర్థం అవుతుంది.

ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో ఈ సినిమాకి జరుగుతున్న బుకింగ్స్ ని చూసి ట్రేడ్ పండితులు సైతం మెంటలెక్కిపోతున్నారు.టికెట్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధి లోనే హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి.

Telugu Eenagaraniki, Okkadu, Simhadri, Tharun Bhaskar, Tholiprema, Vishwak Sen-M

మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా విడుదలైన పక్క రోజే పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ సినిమా కూడా రీ రిలీజ్ అవ్వబోతుంది.ఆ చిత్రానికి కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి కానీ, ఈ నగరానికి ఏమైంది రేంజ్ బుకింగ్స్ మాత్రం జరగడం లేదు.అదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.అయితే ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం బక్రీద్ పండుగ రోజు విడుదల అవుతుంది, కానీ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రం మాత్రం మామూలు వర్కింగ్ డే లో విడుదల అవుతుంది.

అందుకే అంత తేడా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.అయితే ఈ రేంజ్ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్, ఎన్టీఆర్ సింహాద్రి రీ రిలీజ్ కి గాని, మహేష్ బాబు ఒక్కడు చిత్రం రీ రిలీజ్ కి కానీ జరగలేదని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

చూడాలి మరి ఈ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో రీ రిలీజ్ లో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube