వైరల్: ప్రీ వెడ్డింగ్‌ షూట్లో డ్యాన్స్‌ చేస్తూ పడిపోయిన నవ వధువు... వరుడు ఏం చేసాడంటే?

పెళ్లి వేడుకల్లో జరిగే కొన్ని అనూహ్య ఘటనలు అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో దర్శనం ఇస్తూ ఉంటాయి.అందులో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి.

 Viral: The New Bride Fell While Dancing In The Pre-wedding Shoot What Did The Gr-TeluguStop.com

దాంతో అవికాస్త నెటిజనులకు తెగ నచ్చేసి క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి.ఇక వధూ వరుల ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు, పోస్ట్ వెడ్డింగ్‌ షూట్‌లు అయితే చెప్పనక్కర్లేదు.

ఏదో ఒక విషయంలో ఆయా కంటెంట్ తెగ పాపులర్ అయిపోతుంది.తాజాగా అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్‌ అవుతోంది.

ఇక ఈ కోవలోనే తాజాగా ఓ వెడ్డింగ్‌ షూట్‌ కి సంబంధించినటువంటి వీడియో నెటిజన్ల కళ్ళల్లో నీళ్లు తెచ్చేలా నవ్వుని తెప్పిస్తోంది.ఇక సదరు వీడియో విషయానికొస్తే ప్రీ వెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా నూతన వధూ వరులు అందంగా ముస్తాబై స్టేజ్‌పై మంచి రొమాంటిక్ గా ఈ ప్రపంచాన్ని మరిచి డ్యాన్స్‌ చేస్తున్నారు.

ఎంతో రొమాంటిక్‌గా ఇద్దరూ కాలు కదపడం ఇక్కడ గమనించవచ్చు.ఇంతలో అనూహ్యంగా వరుడు వధువు లెహంగాను తొక్కగా ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది.

ఇక ఆమె కింద పడబోయే క్రమంలో వరుడు ఆమెని కాపాడదామని ప్రయత్నించినప్పటికీ కాపాడలేడు.దాంతో ఆమె అమాంతం వెల్లికిలా నెలకి పేస్ట్ అయిపోతుంది.జైపూర్‌ ప్రీ వెడ్డింగ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో డిసెంబర్‌ 15న ఈ వీడియోను అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.ఈ క్రమంలో అనేకమంది నెటిజన్లు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు.‘పెళ్ళికొడుకు కావాలనే ఆమెని పడేసాడు’ అని ఒకరంటే, ‘ఇపుడు ఆమెని పడేసాడు… తరువాత అతను పడతాడు’ అని చాలా కొంటెగా కామెంట్స్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube