14 థియేటర్లలో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన బాలయ్య మూవీ గురించి తెలుసా?

స్టార్ హీరో బాలకృష్ణకు 2021, 2022 సంవత్సరాలు లక్కీ ఇయర్స్ అని అభిమానులు భావిస్తున్నారు.ఈ రెండేళ్లలో బాలయ్య క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Shocking Facts About Balakrishna Narasimha Naidu Movie Details Here , Unstoppab-TeluguStop.com

బాలయ్య ఏం చేసినా అది సక్సెస్ గా నిలుస్తోంది.ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లతో అన్ స్టాపబుల్ షో రేంజ్ మారబోతుందని తెలుస్తోంది.

ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లను వేర్వేరుగా రెండు ఎపిసోడ్లుగా రిలీజ్ చేయనున్నారని సమాచారం.

బాలయ్య కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉండగా ఆ ఇండస్ట్రీ హిట్లలో నరసింహ నాయుడు మూవీ ఒకటి.2001 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బి.

గోపాల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఒకటని చెప్పవచ్చు.ఈ జనరేషన్ బాలయ్య అభిమానులకు కూడా ఈ సినిమా ఎంతగానో నచ్చుతుంది.

ఈ సినిమాలో ట్రైన్ సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.బాలయ్య అభిమానులకు నచ్చే అద్భుతమైన డైలాగ్స్ ఈ సినిమాలో ఉండటంతో యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

అయితే 2001 సంక్రాంతి సమయంలో మృగరాజు, దేవీపుత్రుడు సినిమాలు కూడా రిలీజ్ కావడంతో హైదరాబాద్ లో నరసింహ నాయుడు సినిమాకు రిలీజ్ సమయంలో కేవలం 14 థియేటర్లు మాత్రమే దక్కాయి.

అయితే ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు మెరుగైన టాక్ రావడంతో ఆ తర్వాత ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య పెరగడంతో పాటు కలెక్షన్లు పెరిగాయి.ఈ సినిమా నైజాం హక్కులు 2 కోట్ల రూపాయలకు అమ్ముడవగా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ కు భారీ స్థాయిలో లాభాలు మిగిలాయి.బాలయ్య మార్కెట్ ను ఊహించని స్థాయిలో పెంచిన సినిమాలలో నరసింహ నాయుడు ఒకటని చాలామంది భావిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube