వైరల్: శుభమాని కొత్త కారు కొన్నాడు, పాపం ఏం జరిగిందో తెలిస్తే మీరు జాలిపడతారు!

మూన్నాళ్ళ ముచ్చట కూడా తీరకపోవడం అంటే ఇదే.డ్రైవింగ్ అనేది ఒక కళ.

 Viral: Shubhamani Buys A New Car, You'll Feel Sorry If You Know What Happened ,-TeluguStop.com

డ్రైవ్ చేసేటప్పుడు కంగారు పడకుండా చాలా ప్రశాంతంగా డ్రైవ్ చేయడం కొందరి వల్ల కాదు.ముఖ్యంగా కారు డ్రైవింగ్ అంటే ఇష్టపడని వారు వుండరు.

ఇక సగటు మధ్యతరగతి వాడికైతే కారు కొనుక్కోవడం అనేది ఓ కల.దానికోసం కారు డ్రైవింగ్ నేర్పే స్కూల్స్ లో జాయిన్ అయ్యి మరీ డ్రైవింగ్ నేర్చుకుంటారు.ఇక రూపాయి రూపాయి పోగుచేసుకుని, ఆ సమయం వచ్చినపుడు తమ బడ్జెట్లో ఓ కారుని కొనుక్కుంటారు.అయితే ఆ కారుకి అనుకోకుండా ఆక్సిడెంట్ అయితే ఎలా ఉంటుంది? .

వూహించుకోవడానికే కష్టంగా ఉంటుంది కదూ.ఇక్కడ కూడా సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది.ఓ వ్యక్తి ఎన్నో ఏళ్లగా కారు కొనాలని అనుకొని, ఓరోజు షోరూముకి వెళ్లి అనుకున్న కారుని కొనేసాడు.అటువైపునుండే తన ఇష్టదైవం గుడికి వెళ్లి, బాగా పూజలు చేయించాడు.

ఎంతో ఆనందంగా తన ఇంటికి తిరుగుముఖం పట్టాడు.ఇంటికి చేరుకున్నాడు.

అపార్ట్మెంట్ గేటు దగ్గర వున్న సెక్యూరిటీ గార్డు గేట్ తీయడంతో కారుని నెమ్మదిగా లాబీలోకి తరలించాడు.ఇంతలో అనూహ్య పరిణామం… ఒక్క క్షణంలో ఆ కారు అక్కడ వున్న కొన్ని బైక్స్ ని గుద్దుకుంటూ వెళ్ళిపోయి బోల్తా పడింది.

ఇపుడు దీనికి సంబంధించినటువంటి వీడియో (సీసీ ఫుటేజ్) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే దానిని చూసిన నెటిజన్లు చాలా రకాలుగా స్పందిస్తున్నారు.‘సరిగ్గా డ్రైవింగ్ నేర్చుకుని కారుని నడిపితే ఈ తిప్పలు వుండవు కదా’ అని ఒకరంటే.‘నడపడం రానప్పుడు కారును ఎందుకు నడపడం’ అని మరొకరంటే, ‘బ్రేక్ మీద పెట్టాల్సిన కాలును ఎక్స్ లేటర్ మీద పెడితే అలాగే ఉంటుంది’ అని వేరొకరు… ఇలా ఎవరి నచ్చినట్టు వారు కామెంట్స్ చేసారున్నారు.కాగా ముంబైలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube