మనిషి జీవితంలో మరణం అనేది ఒక అత్యంత బాధాకరమైన విషయం.మనిషి జీవించి ఉన్నపుడు పట్టించుకోకపోయినా మరణించారని తెలిస్తే బాధపడని వారుండరు.
అదే మన కుటుంబంలో మరణిస్తే అల్లడిపోతాము.అలాగే మనిషికున్న ఫీలింగ్స్, ఎమోషన్స్ మూగ జీవులైన జంతువుల్లో కూడా ఉంటాయి.
తమకు అలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయని ఓ పిల్లి నిరూపించింది.
గుజరాత్ లోని సూరత్ నగరంలో లియో కోకో అనే పిల్లి తన తోబుట్టువు అయిన కోకో చనిపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతుంది.
కోకోని పూడ్చిన సమాధి వద్ద కూర్చుని రోధిస్తుంది.వివరాల్లోకి వెళితే.వల్సాద్ లో రైల్వే ఉద్యోగి మున్నవర్ షేక్ కుమారుడు ఫేసెల్.అతనికి నాలుగేళ్ళ క్రితం తన స్నేహితులు రెండు పిల్లులను బహుమతిగా ఇచ్చారు.
ఆ రెండు పిల్లులు పెర్షియన్ జాతికి చెందినవి అవ్వడంతో చాలా అందంగా బొమ్మలాంటి డాల్ ఫేస్ కలిగి ఉంటాయి.అందులో తెల్ల రంగు బొచ్చు ఉన్న ఒక పిల్లి పేరు లియో, నల్లగా ఉన్న పిల్లికి కోకో అని పేరు పెట్టారు.
అయితే అవి రెండూ కలిసి ఎంతో హాయిగా ఉండేవి.అయితే దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం షేక్ నివాసం నుంచి కోకో పిల్లి ఆడుకుంటూ తప్పి పోయింది.
వాళ్ళు ఎంత వెతికినా కోకో ఆచూకీ దొరక లేదు.సుమారు ఆరు నెలల తరువాత కోకో ఆచూకీ దొరికింది.
కానీ కోకో అనారోగ్యం బారిన పడింది.రోజురోజుకి ఆ పిల్లి పరిస్థితి క్షీణించింది.ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.ఆస్పత్రిలొనే చికిత్స పొందుతూ తన తుది శ్వాస విడిచింది.
అయితే ఎంతో స్నేహంగా ఉన్న రెండు పిల్లుల్లో ఒకటైన కోకో మృతి లియో జీర్ణించుకోలేకపోయింది.దాంతో ఎంతో బాధ పడింది.
షేక్ కుటుంబ సభ్యులు కోకో బాడీని ఇంటికి తీసుకొచ్చి గురువారం వారి ఇంటి ఆవరణలో ఖననం చేశారు.కానీ లియో తన తోబుట్టువు మృతిని తట్టుకోలేక కొన్ని గంటల వ్యవధిలోనే కోకో సమాధి వద్ద కూర్చుని తీవ్ర ఆవేదన చెందినట్టు ఫేసల్ వెల్లడించారు.
లియో ప్రవర్తన చూసి తాము ఆశ్చర్య పోయామని, అలాగే తాము కూడాబాధపడ్డామని తెలిపారు.లియో చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది.
దాంతో ఆ పిల్లిని చూసేందుకు స్థానికులు కూడా వస్తున్నారు.