Vijay Varma : జ్యోతిష్యుడు వద్దన్నాడని సినిమా నుండి తొలగించారు.. తమన్నా ప్రియుడి షాకింగ్ కామెంట్స్..!!

నటుడు విజయ్ వర్మ ( Vijay Varma ) అంటే ఒకప్పుడు తెలియకపోవచ్చు.కానీ ఎప్పుడైతే తమన్నాతో ఈయన లవ్ ట్రాక్ బయటపడిందో అప్పటినుండి అందరికీ సుపరిచితమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

 Vijaya Varma Shocking Comments I Was Removed From Film Because Astrologer Says-TeluguStop.com

ఎన్ని సినిమాల్లో నటించినా ఈయనకు రాని గుర్తింపు కేవలం తమన్నా ( Tamannah ) ప్రియుడు గా ఇండస్ట్రీలో ఎక్కువ ఫేమస్ అయ్యారు.అయితే ఈయన తెలుగులో నాని హీరోగా చేసిన ఎంసీఏ సినిమాలో విలన్ పాత్ర పోషించినప్పటికీ ఎక్కువ గుర్తింపు వచ్చింది మాత్రం తమన్నా బాయ్ ఫ్రెండ్ గానే.

అయితే తాజాగా కొన్ని ఇంటర్వ్యూలో పాల్గొంటూ తనకు ఎదురైన ఎన్నో చేదు అనుభవాలను చెప్పుకొస్తున్నారు విజయ్ వర్మ .రీసెంట్ గా ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మాట్లాడుతూ.

Telugu Bollywood, Mca, Nani, Tamanna Batia, Vijay Varma-Movie

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బాలీవుడ్ ( Bollywood ) లో నాకు ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.కానీ వచ్చిన అవకాశాలు తొందరగానే చేయి జారిపోయాయి.అయితే ఒక పెద్ద సినిమాలో నాకు మంచి అవకాశం వచ్చింది.ఆ తర్వాత కొన్ని ఫోటోలు పంపమని చెబితే నా ఫోటోలు పంపించాను.కానీ కొద్ది రోజులకే నన్ను ఆ సినిమా నుండి తొలగించారు.అయితే దానికి ప్రధాన కారణం ఆ సినిమా తెరకెక్కించే డైరెక్టర్ కి ఆయన జ్యోతిష్యుడు నన్ను సినిమా నుండి తీసేయమని చెప్పారట.

అందుకే ఆ సినిమా నుండి తీసేశారు.ఆ సమయంలో నేను ఎంతగానో బాధపడ్డాను.

Telugu Bollywood, Mca, Nani, Tamanna Batia, Vijay Varma-Movie

కానీ బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా ( Naseeruddin shah ) నన్ను చాలా ఓదార్చరు.ఆయన ఆరోజు చెప్పిన మాటలు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశాయి.ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇలా డీలా పడిపోకూడదు అని నాకు ధైర్యం చెప్పారు.ఇక ఆయన చెప్పిన మాటలు నాకు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చాయి.ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని డబ్బుల కోసం కొన్ని సినిమాల్లో ఇష్టం లేకుండా కూడా చిన్న చిన్న పాత్రల్లో చేయాల్సి వచ్చింది.

అలా ప్రస్తుతం మీ ముందు నటుడిగా గుర్తింపు ఉన్న పాత్రల్లో చేస్తున్నాను అంటూ నటుడు విజయ్ వర్మ (Vijay Varma ) చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube