తమిళ్ సినిమా హీరో అయిన విజయ్( Vijay ) ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను సైతం అలరించడానికి రెడీ అవుతున్నాడు.ఆయన మార్కెట్ అనేది తెలుగులో కూడా భారీగా విస్తరించాలని చూస్తున్నాడు.
ఈ సినిమా హిట్ అయితే తెలుగు లో ఆయనకి విపరీతమైన మార్కెట్ ఏర్పడడంలో ఆశ్చర్యం లేదు.కానీ ఈ సినిమా గనుక విజయం సాధించకపోతే మాత్రం తెలుగు లో ఆయన కి ఇక విజయాలు రావనే చెప్పాలి.
ఎందుకంటే ఇప్పటికే ఆయన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయినప్పటికీ అందులో తుపాకీ సినిమా ఒకటే కొంతవరకు పర్లేదు అనిపించుకుంది.
మిగిలిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆడలేదు దాంతో ఆయన తెలుగు మార్కెట్ పైన ఎప్పుడు కన్నేసిన కూడా ఆ సినిమాలు డిజాస్టర్ లను మూట పెట్టుకుంటున్నా నేపథ్యంలో ప్రస్తుతం ఆయన లియో సినిమా ద్వారా మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) డైరెక్టర్ కావడం ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.దాంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కూడా చాలా వరకు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి.మరి ఈ సినిమాతో లోకేష్ కనకరాజ్ ఏ మేరకు తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తాడో చూడాలి.
అలాగే ఈ సినిమాతో విజయ్ తను అనుకున్న మార్కెట్ ని రీచ్ అవుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఈ సినిమా సక్సెస్ మీద లోకేష్ కనకరాజ్, విజయ్ కెరియర్లు కూడా డిపెండ్ అయి ఉన్నాయనే చెప్పాలి.ఎందుకంటే విజయ్ కి ఇంతకుముందు చేసిన బీస్ట్( Beast ) గానీ,వారసుడు గానీ పెద్దగా సక్సెస్ లు సాధించలేదు.దాంతో ఇప్పుడు ఆయనకి అర్జెంటుగా ఒక హిట్ కావాలి అది లియో రూపంలో వస్తుందని భావిస్తున్నాడు.
చూడాలి మరి ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తుందొ…