తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ముఖ్యనేతలు పర్యటనలు చేయనున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు నాయకుల పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది.
ఇందులో భాగంగా ఈనెల 20వ తేదీన స్మృతి ఇరానీ రాష్ట్రానికి రానుండగా 27వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు.28న అస్సాం సీఎం హిమంత, 31వ తేదీన యూపీ సీఎం యోగి పర్యటనకు రానున్నారు.రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రచారాన్ని కొనసాగించనున్నారని తెలుస్తోంది.







