ఆ బ్యాక్ డ్రాప్ లో విజయ్ - తిన్ననూరి మూవీ.. బ్లాక్ బస్టర్ ఖాయమా?

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ప్రజెంట్ చేస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”ఖుషి”.ఈ సినిమా మరో 10 రోజుల్లో రిలీజ్ కాబోతుంది.

 Vijay Deverakonda Gowtam Tinnanuri's Vd12 Update, Vd12, Vijay Deverakonda, Gowta-TeluguStop.com

అందుకే ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు విజయ్ ఫ్యాన్స్ అంతా ఖుషి సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.లైగర్ వంటి ప్లాప్ తర్వాత విజయ్ నెక్స్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇదైనా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Telugu Khushi, Samantha, Sree Leela, Vd-Movie

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత ( Samantha ) హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే స్ట్రాంగ్ బజ్ ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.ఇదిలా ఉండగా విజయ్ ఖుషి తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.

వీటిలో జర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో చేయబోతున్న సినిమా ఒకటి.ఇటీవలే ఈ సినిమా గ్రాండ్ లాంచ్ జరుపుకుంది.

శ్రీలీల, విజయ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.ఇప్పటికే షూట్ స్టార్ట్ చేసుకుని ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

Telugu Khushi, Samantha, Sree Leela, Vd-Movie

విజయ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇక తాజాగా వస్తున్న బజ్ ప్రకారం ఈ మూవీ గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కుతుందట.ఈ మధ్య ఇలాంటి సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువుగానే ఉంది.దీంతో ఈ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ లో హిట్ అవ్వడం పక్కా అంటున్నారు.ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై సాయి సౌజన్య, నాగ వంశీ గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నారు.అలాగే అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా షూట్ ఫాస్ట్ గా పూర్తి చేసి ఈ ఏడాది లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube