విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తాజాగా నటించిన ఖుషి సినిమా( Kushi Movie ) మంచి సక్సెస్ కావడంతో ఈయన ఎంతో సంతోషంలో ఉన్నారు.ఈ క్రమంలోనే ఖుషి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా తాజాగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.
ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.కొందరు ఉద్దేశపూర్వకంగానే నాపై నా సినిమాలపై డబ్బులు ఇచ్చి చెడు ప్రచారం చేయిస్తున్నారని ఈయన తెలిపారు.
అయితే ఈ ఆనంద సమయంలో వాటి గురించి తాను మాట్లాడదలచుకోలేదని తెలిపారు.
ఇక ఈ సినిమా విషయంలో మీ ముఖాలలో చిరునవ్వులు చూడాలని నా కోరిక నెరవేరిందని విజయ్ దేవరకొండ తెలిపారు.డబ్బులు సంపాదించి సమాజంలో గౌరవం పొంది అమ్మానాన్నలను సంతోషంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే తాను పనిచేస్తూ ఉన్నానని తెలిపారు.అయితే ఇప్పటినుంచి మీకోసం పనిచేస్తానని మీరందరూ ఆనందంగా ఉండాలని ఈయన కోరుకున్నారు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కలిసి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను కానీ అది కుదరడం లేదని ఈయన తెలిపారు.
అందుకే తాను తాను సంపాదించిన సంపాదనలో ఒక కోటి రూపాయలు ( One Crore ) అభిమానులకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
ఈ క్రమంలోనే వంద కుటుంబాలను( 100 Families ) ఎంపిక చేసి ఒక్కొక్కరికి ఒక్కో లక్ష రూపాయలు ఇవ్వబోతున్నానని ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మనమంతా దేవర ఫ్యామిలీ.నా ఆనందం, సంపాదనను మీతో పంచుకోకపోతే వేస్ట్.
నేను అనుకున్న ఈ పని పూర్తయినప్పుడు ఖుషి విషయంలో తృప్తిగా ఉంటాను అంటూ విజయ్ దేవరకొండ అభిమానులను ఉద్దేశిస్తూ ఈ కార్యక్రమంలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.