వీడియో: బెడ్‌పై స్టంట్ చేసిన యువతి.. చివరికి దెబ్బ తగలడంతో ఎలా మొత్తుకుందో..

కొంతమంది అనాలోచితంగా ఆలోచిస్తూ మూర్ఖపు పనులు చేసి చివరికి వారే తీవ్ర గాయాల పాలవుతుంటారు.కొందరు స్టంట్స్‌ ( Stunt )చేసేటప్పుడు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రొసీడ్ అవుతుంటారు.

 Video: The Young Woman Who Performed Stunts On The Bed , Viral Video, Latest Ne-TeluguStop.com

కొంచెం తేడా వచ్చినా దెబ్బలు తగులుతాయని తెలిసినా వారు పెద్దగా పట్టించుకోరు.చివరికి పశ్చాత్తాప పడుతుంటారు.

తాజాగా ఒక యువతి కూడా బెడ్ పై 360 డిగ్రీస్ లో రౌండ్ ఆఫ్ అని ఒక జిమ్నాస్టిక్ స్టంట్( Gymnastic stunt ) చేసింది.కానీ ఆ క్రమంలో ఒక పొరపాటు జరగడం వల్ల ఆమె కాళ్ళకు మంచం బలంగా తగిలింది.

అంతే, ఆ యువతి చెవులకు చిల్లులు పడేలా అరిచింది.

దీనికి సంబంధించిన వీడియోకు మూడు లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.దీనిని @ సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.వైరల్ వీడియో( .Viral video ) ఓపెన్ చేస్తే, కెమెరా వైపు చూస్తూ ఒక యువతి ఏదో చెప్పడం చూడవచ్చు.తర్వాత సదరు యువతి రౌండ్ ఆఫ్ స్టంట్ చేయడం మొదలు పెట్టింది.

ఆ బెడ్ చాలా మెత్తగా ఉన్నట్లుంది.దానిపై ఆమె బాగానే రెండుసార్లు పల్టీలు కొట్టింది.

మూడోసారి కూడా పల్టీ కొట్టింది కానీ ల్యాండ్ అయ్యే సమయంలో ఆమె పాదాలు మంచం చెక్కలకు తగిలాయి.చాలా వేగంతో ఆమె ఆ స్టంట్ చేస్తోంది.

అందువల్ల, ఆమె పాదాలకు తీవ్రంగా దెబ్బ తగిలినట్లు అనిపించింది.ఈ స్టంట్ బెడిసి కొట్టిన తర్వాత ఆ యువతి బెడ్ పై పడుకొని లేవలేకపోయింది.

అలానే ఏడ్చేస్తూ కనిపించింది.

ఈ వీడియో చూసి చాలా మంది అయ్యో పాపం అంటుంటే మరికొందరు మాత్రం నవ్వుకుంటున్నారు.మళ్ళీ ఇలాంటి స్టంట్ ఆమె బెడ్ లో జన్మలో చేయదేమో అని ఇంకొందరు పేర్కొన్నారు.ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube