బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పై పిడుగు లాంటి వార్త చెప్పిన వేణు స్వామి?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు బాలకృష్ణ ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన ఇప్పటికే హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 Venu Swami Gave The News Balayyas Son Mokshajnas Entry, Mokshagna ,venu Swami, B-TeluguStop.com

అయితే ఇప్పటికే బాలకృష్ణ తో పాటు హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు హీరోయిన్ల పిల్లలు తమ వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.కానీ బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ( Mokshagna ) మాత్రం ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి రాలేదు.

Telugu Balakrishna, Mokshagna, Venu Swami-Movie

బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అంటూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ గత ఐదు సంవత్సరాల నుంచి వార్తలు వస్తూనే ఉన్నప్పటికీ ఈయన ఎంట్రీ గురించి ఇప్పటివరకు అధికారక ప్రకటన వెలువడ లేదు.ఇదిలా ఉండగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా ఆస్ట్రాలజర్ వేణు స్వామి ( Venu Swamy )సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సీనియర్ సెలెబ్రెటీల గురించి మాట్లాడటంతో యాంకర్ తనని ప్రశ్నిస్తూ బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ జాతకం చూశారా అంటూ ఈయనని ప్రశ్నించారు.

Telugu Balakrishna, Mokshagna, Venu Swami-Movie

ఈ ప్రశ్నకు వేణు స్వామి సమాధానం చెబుతూ తాను మోక్షజ్ఞ జాతకం చూసానని చెప్పడమే కాకుండా ఆయన సినీ కెరియర్ గురించి కూడా పలు విషయాలు తెలియజేశారు.మోక్షజ్ఞ సినీ కెరియర్ చాలా అద్భుతంగా ఉండబోతుందని వేణు స్వామి తెలియజేశారు.అయితే ఆయన ఇప్పుడే ఇండస్ట్రీలోకి రారని ఇండస్ట్రీలోకి రావడానికి మరో రెండు మూడేళ్ల సమయం పడుతుంది అంటూ పిడుగు లాంటి వార్త చెప్పారు.ఈ సంవత్సరంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి నందమూరి ఫ్యాన్స్ ఈ వార్త వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ప్రస్తుతం మోక్షజ్ఞ గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube