బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పై పిడుగు లాంటి వార్త చెప్పిన వేణు స్వామి?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు బాలకృష్ణ ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన ఇప్పటికే హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

అయితే ఇప్పటికే బాలకృష్ణ తో పాటు హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు హీరోయిన్ల పిల్లలు తమ వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.

కానీ బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ( Mokshagna ) మాత్రం ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి రాలేదు.

"""/" / బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అంటూ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.

అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ గత ఐదు సంవత్సరాల నుంచి వార్తలు వస్తూనే ఉన్నప్పటికీ ఈయన ఎంట్రీ గురించి ఇప్పటివరకు అధికారక ప్రకటన వెలువడ లేదు.

ఇదిలా ఉండగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా ఆస్ట్రాలజర్ వేణు స్వామి ( Venu Swamy )సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సీనియర్ సెలెబ్రెటీల గురించి మాట్లాడటంతో యాంకర్ తనని ప్రశ్నిస్తూ బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ జాతకం చూశారా అంటూ ఈయనని ప్రశ్నించారు.

"""/" / ఈ ప్రశ్నకు వేణు స్వామి సమాధానం చెబుతూ తాను మోక్షజ్ఞ జాతకం చూసానని చెప్పడమే కాకుండా ఆయన సినీ కెరియర్ గురించి కూడా పలు విషయాలు తెలియజేశారు.

మోక్షజ్ఞ సినీ కెరియర్ చాలా అద్భుతంగా ఉండబోతుందని వేణు స్వామి తెలియజేశారు.అయితే ఆయన ఇప్పుడే ఇండస్ట్రీలోకి రారని ఇండస్ట్రీలోకి రావడానికి మరో రెండు మూడేళ్ల సమయం పడుతుంది అంటూ పిడుగు లాంటి వార్త చెప్పారు.

ఈ సంవత్సరంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి నందమూరి ఫ్యాన్స్ ఈ వార్త వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ప్రస్తుతం మోక్షజ్ఞ గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్టూడెంట్‌ను అద్దె ఇంటి నుంచి వెళ్లగొట్టిన కంపెనీ.. భారీ ఫైన్ విధించిన కోర్టు..