'సైంధవ్' టీజర్ తో రాబోతున్న వెంకీమామ.. డేట్ అండ్ టైం ఫిక్స్!

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ( Venkatesh ) ప్రస్తుతం తన కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ అయిన 75వ ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు.వెంకీ ఈసారి కాస్త డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్నాడు.

 Venkatesh Saindhav Teaser Update, Venkatesh, Saindhav, Saindhav Teaser, Sailesh-TeluguStop.com

హర్రర్ స్టోరీతో ఈసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి వెంకీ మామ సిద్ధం అయ్యాడు.ఆ సినిమానే ”సైంధవ్”( Saindhav ). ఈ సినిమాతో ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలని వెంకటేష్ పట్టుదలగా ఉన్నారు.

Telugu Sailesh Kolanu, Saindhav, Saindhav Teaser, Venkatesh-Movie

ఈ మధ్య కాలంలో చిరు, బాలయ్య వంటి సీనియర్ హీరోలు వరుస హిట్స్ కొడుతుంటే ఈయన వెనుకబడి పోయారని అందుకే ఈసారి అదిరిపోయే సబ్జెక్ట్ తో రాబోతున్నాడు.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఈ మధ్య కాలంలో వెంకటేష్ సినిమాలకు ఎప్పుడు లేనంత అంచనాలు పెరిగాయి.

హిట్ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను( Director Sailesh kolanu ) గురించి అందరికి తెలుసు.

మరి ఈ యంగ్ డైరెక్టర్ తోనే ఇప్పుడు వెంకీ తన సినిమా చేస్తున్నాడు.శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

ఈ సినిమాతో వెంకీ సంక్రాంతి బరిలో దిగనున్నట్టు ఈ మధ్యనే అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చాడు.

Telugu Sailesh Kolanu, Saindhav, Saindhav Teaser, Venkatesh-Movie

ఇక తాజాగా ఈ సినిమా టీజర్( Saindhav Teaser ) గురించి అఫిషియల్ అప్డేట్ వచ్చింది.ఈ టీజర్ ను అక్టోబర్ 16న ఉదయం 11 గంటల 34 నిముషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.దీంతో పాటు ఒక ఇంటెన్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.

మరి ఈ సాలిడ్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.కాగా వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.

సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్( Shraddha Srinath ) నటిస్తుండగా.

ఆండ్రియా, రుహనీ శర్మ కూడా కీ రోల్స్ పోషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube