అదిరిపోయే సీక్వెల్‌ ప్లాన్ చేస్తున్న మెగా హీరో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోరు.దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలాంటి కథతో వచ్చి ప్రేక్షకులను మెప్పించిందో అందరికీ తెలిసిందే.

 Varun Tej, Kanche, Krish, Pragya Jaiswal, Sequel-TeluguStop.com

వార్ బేస్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

ఇక వరుణ్ తేజ్ యాక్టింగ్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

ఈ సినిమాను క్రిష్ ప్రెజెంట్ చేసిన విధానం అత్యద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది.ఇలాంటి సినిమా కెరీర్‌లో ఒక్కసారే పడుతుందని వరుణ్ తేజ్ అన్నాడు.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తే మరింత బాగుంటుందని వరుణ్ భావిస్తున్నాడట.అందుకే తనవద్దకు వస్తున్న రైటర్స్‌కు కంచె సీక్వెల్ కథను రెడీ చేయాలని కోరాడట.

వరుణ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ కథను ఎవరు అందిస్తారో చూడాలి.కాగా కంచె సినిమా రిలీజ్ అయ్యి ఐదేళ్లు కావస్తోంది.

ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube