Pawan Kalyan : పిఠాపురంలో పవన్ కు వర్మ చుక్కలు చూపిస్తున్నారా.. మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి అలా చేస్తున్నారా?

ఏపీ ఎన్నికలు జరుగుతున్న 175 నియోజకవర్గాలలో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.పిఠాపురంలో టీడీపీ నుంచి పోటీ చేయాలని అనుకున్న వర్మ పిఠాపురం( Varma )ను జనసేనకు కేటాయించడంతో నిరుత్సాహానికి గురైనా పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Varma Shocks To Pawan Kalyan In Politics Details Here Goes Viral In Social Medi-TeluguStop.com

అయితే టీడీపీ కార్యకర్తలు జనసేన తరపున ప్రచారం చేయడానికి వర్మ అంగీకరించడం లేదని తెలుస్తోంది.

Telugu Chandra Babu, Jana Sena, Pawan Kalyan, Pithapuram, Vanga Geetha, Varma-Po

వర్మ పైకి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నా సైలెంట్ గా పవన్ కు మద్దతు ఇవ్వకుండా చేసే పనులు చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇదే పరిస్థితి కొనసాగితే పవన్ కళ్యాణ్ కు ఇబ్బందేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.వర్మ వ్యవహారశైలి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

వర్మ రాబోయే రోజుల్లో పవన్ కు అనుకూలంగా వ్యవహరిస్తారో లేక షాకిస్తారో చూడాల్సి ఉంది.

Telugu Chandra Babu, Jana Sena, Pawan Kalyan, Pithapuram, Vanga Geetha, Varma-Po

మరోవైపు వైసీపీ అభ్యర్థి వంగా గీత( Vanga Geetha ) ప్రచారంలో దూసుకుపోతున్నారు.పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు సహకారంతో వంగా గీత గెలుపు కోసం కష్టపడుతున్నారు.వంగా గీత ఓటర్లను నేరుగా కలిసి తనకు ఎందుకు ఓటు వేయాలో చెబుతున్నారు.

పవన్ ను ఓడించడానికి వైసీపీ నేతలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వంగా గీత విజ్ఞప్తికి స్థానికుల నుంచి సైతం సానుకూల స్పందన వస్తోంది.పవన్ కళ్యాణ్ చిన్నచిన్న తప్పులు చేస్తే ఆ తప్పుల వల్ల భారీ స్థాయిలో నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్, వంగా గీతలలో ఎవరు ఎమ్మెల్యేగా విజయం సాధించినా మెజారిటీ మరీ భారీగా అయితే ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే 20 రోజుల పాటు ఉండనున్నారని సమాచారం అందుతుండటం గమనార్హం.పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube