పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.ఇక మరో వైపు తన లైనప్ లో ఉన్న సినిమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
అందుకే తన సినిమాలకు డేట్స్ కేటాయిస్తున్నారు.మరి పవన్ లైనప్ లో ఉన్న క్రేజీ సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh )’ ఒకటి.
ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే ఈ సినిమాను గబ్బర్ సింగ్ వంటి హిట్ ఇచ్చి పవన్ ను చాలా ఏళ్ల తర్వాత ఫామ్ లోకి తీసుకు వచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు కాబట్టి.ప్రకటించిన కొత్తలో ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఆ చిన్న షెడ్యూల్ తోనే హరీష్ పవన్ పై అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ అంత ఇంప్రెస్ అయ్యారు.
ఇక మళ్ళీ ఇన్ని రోజులకు ఈ సినిమా షూట్ కు పవన్ డేట్స్ ఇవ్వడంతో మళ్ళీ స్టార్ట్ అయ్యింది.ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి కొన్ని పిక్స్ ను డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) షేర్ చేయగా అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.నిన్నటి నుండి షూట్ స్టార్ట్ కాగా తాజాగా షెడ్యూల్ కు సంబంధించిన పిక్స్ ను హరీష్ షేర్ చేసారు.ఈ పిక్స్ ఫ్యాన్స్ లో వైరల్ అయ్యాయి.
పవన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ పిక్స్ లో పవన్ లుక్ ఆకట్టుకుంటుంది.
కాగా ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్ లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
అలాగే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ కాంబో గబ్బర్ సింగ్ వంటి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.