భారత్ లోని టెక్ నిపుణులకు అమెరికా కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టుగా వెల్లడించింది.దాంతో టెక్ రంగ నిపుణులు సదరు కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు సైతం మొదలు పెట్టేశారు.
అమెరికా వెళ్లి ఉద్యోగం చేయలన్నా, ఆయా కంపెనీలలో పనిచేసే అవకాశం దొరకాలంటే అంత సులభం కాదు.అయితే అమెరికా కంపెనీకి చెందిన యూఎస్టీ ఇండియా సదరు కంపెనీకి బెంగుళూరు, హైదరాబాద్ లలో కంపెనీలు ఉండటంతో మరింతగా తన వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తోంది.
బెంగుళూరు కి చెందిన శాఖలో సుమారు 6 వేల మంది పనిచేస్తుండగా విస్తరణలో భాగంగా ఈ సంఖ్యను 12 వేలుగా చేయడానికి ప్రణాలికలు సిద్దం చేసుకుంది.ప్రస్తుతం హెల్త్ కేర్, లాజిస్టిక్ వంటి పలు విభాగాలలో నిపుణులను, అనుభవజ్ఞులైన వారిని నియమించుకొనున్నట్టుగా ప్రకటించింది.
ప్రస్తుతం హైదరాబాద్ కి చెందిన ఇదే సంస్థలో త్వరలో సుమారు 1000 ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్టుగా ప్రకటించింది.
యూఎస్టీ సంస్థకు అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా ఉందని సుమారు 25 దేశాలలో 40 కి పైగా కార్యాలయాలు ఉన్నాయని తెలుస్తోంది.
అమెరికా కంపెనీలో ఉద్యోగం చేయాలనుకునే ఇది మంచి అవకాశమే అంటున్నారు సంస్థ చీఫ్.భారత్ లో సంస్థ వ్యాపారాన్ని వృద్ది చేయడమే లక్ష్యంగా విస్తరణ జరుగుతోందని, ఆకర్షణీయమైన జీతాలతో నిపుణులకు ఆహ్వానం అందిస్తున్నామని ఆయన ప్రకటించారు.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్, సెమీ కండక్టర్స్ , లాజిస్టిక్, హెల్త్ కేర్ విభాగాలలో వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు.