ప్రస్తుతం వరుస సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ఊర్వశీ రౌతేలా ( Urvashi Rautela ) ఒకరు.ఈమె సౌత్ సినిమాలలో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసే అవకాశం అందుకుంటున్నారు.
కేవలం ఐదు నిమిషాల్లో పాట కోసం దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటనపరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె గత రెండు రోజుల క్రితం అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో( Narendra Modi Stadium ) జరిగినటువంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూడటం కోసం స్టేడియం వెళ్లారు.
ఇలా స్టేడియం వెళ్ళినటువంటి ఈమె ఇండియాని సపోర్ట్ చేస్తూ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని పెద్ద ఎత్తున స్టేడియంలో సందడి చేశారు.అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇలా మ్యాచ్ గెలిచిందన్న ఆనందం కొంతసేపటి వరకు కూడా తనలో లేదని చెప్పాలి.ఇలా మ్యాచ్ చూస్తూ ఆనందంలో మునిగిపోయినటువంటి ఈమె ఐ ఫోన్ ( IPhone ) స్టేడియంలో పోగొట్టుకున్నారు.
దీంతో తన ఫోన్ పోయిందని ఎలాగైనా తన ఫోన్ దొరికిన వారు తనకు తెచ్చి ఇవ్వాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోన్ కోసం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాను పోగొట్టుకున్న ఐఫోన్ అలాంటిది ఇలాంటిది కాదు.24 క్యారెట్ల బంగారంతో తయారుచేసిన ఫోన్ కావడంతో తన ఫోన్ విషయంలో ఈమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఫోన్ పోగొట్టుకున్నటువంటి విషయాన్ని ఈమె పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు.తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ఈమె స్పందిస్తూ తన ఫోన్ చివరిగా ఒక మాల్ లోలోకేషన్ చూపించిందని ఈ ఫోన్ దొరికినవారు తనకు ఇవ్వాలని మరోసారి వేడుకున్నారు.అలాగే ఈ ఫోన్ తెచ్చిన వారికి తన నుంచి ఊహించని విధంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
ఇలా సర్ప్రైజ్ ఉంటుందని చెప్పినప్పటికీ ఈమె ఏమి ఇస్తున్నారో మాత్రం తెలియచేయడం లేదు.ఏది ఏమైనా తన ఐఫోన్ పోగొట్టుకున్న నేపథ్యంలో ఊర్వశి మాత్రం చాలా బాధపడుతున్నారని తెలుస్తోంది.
మరి ఇప్పటికైనా ఈమె ఫోన్ దొరికిన వారు తనకు అందజేస్తారా లేదా తెలియాల్సి ఉంది.