ఓ మహిళ తన రెండేళ్ల వయసున్న మేనకోడలు అల్లరి చేస్తూ ఏడుస్తోందని, ముఖంపై దిండును గట్టిగా అదిమిపట్టి హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో ఉండే హనుమాన్ తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.జబల్పూర్( Jabalpur ) లోని మోహనియా ప్రాంతం వెనుకబడిన ముస్లిం ప్రాబల్య ప్రాంతం.ఈ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఎలిజా అనే రెండేళ్ల బాలిక కనిపించకుండా పోయింది.సోమవారం రోజు సాయంత్రం వరకు చుట్టుపక్కల ప్రాంతాలను గాలించిన ఎలిజా కనిపించకపోవడంతో తండ్రి మహమ్మద్ షకీల్ స్థానికంగా ఉండే హనుమాన్ తాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు సీసీటీవీ కెమెరాల చుట్టుపక్కల ఉండే ప్రాంతాలను గాలించిన ఎలిజా ఆచూకీ లభించలేదు.దీంతో పోలీసులకు అర్థమైంది ఏమిటంటే.బయట వ్యక్తులు బాలికను కిడ్నాప్( Kidnap ) చేసే అవకాశం లేదు.కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు ఎలిజాను ఏమైనా చేసి ఉంటారని పోలీసులు భావించారు.
ఇంట్లో మొత్తం సోదాలు నిర్వహించగా.బాలిక మృతదేహం మేడ మీద గదిలో ఉండే సోఫా కింద లభించింది.బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు.బాలికను ఎవరో ఊపిరి ఆడనీయకుండా చేసి చంపారని పోలీసుల విచారణలో తెలిసింది.అయితే పోలీసులకు మృతురాలి మేనత్త అప్సానాపై అనుమానం వచ్చింది.దీంతో పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక అప్సానా అడ్డంగా దొరికిపోయింది.
సోమవారం మధ్యాహ్నం ఎలిజా తన మేనత్త అప్సానా గదికి వెళ్ళింది.అయితే అప్సానా కిందకు వెళ్లాలని ఎలిజాకు చెబితే.
ఎలిజా కిందకు వెళ్లలేదు.దీంతో కోపంతో మేనకోడలి చెంపపై ఒక దెబ్బ కొట్టింది.
ఎలిజా బిగ్గరగా ఏడుస్తూ అప్సానాకు చిరాకు తెప్పించింది.క్షణికావేశంలో దిండుతో ఎలిజా ముఖంపై గట్టిగా నొక్కి, ఊపిరి ఆడనీయకుండా చేసి చంపేసింది.
ఎలిజా మృతదేహాన్ని ఎవరు కనిపెట్టకుండా ఉండడం కోసం సోఫా కింద బాలిక మృతదేహాన్ని దాచింది.పోస్టుమార్టం నివేదిక రాగానే అప్సానపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఈ హత్య కేసులో అప్సానాకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.