మెగా ఫ్యామిలీలోకి త్వరలోనే బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఉపాసన తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని తెలియజేసిన క్షణాల్లో వైరల్ గా మారుతుంది.
దాదాపు పది సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా మారబోతున్న తరుణంలో మెగా ఫ్యామిలీతో పాటు, అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇలా ఉపాసన తల్లి కాబోతుందనే విషయం తెలిసినప్పటి నుంచి ఉపాసన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
మరి కొద్ది నెలలలో ఉపాసన పండంటి బిడ్డకు జన్మ నివ్వబోతున్నారు.ఇకపోతే తాజాగా ఉపాసన స్నేహితులు ఉపాసన ఇంటికి వెళ్లి ఉపాసన ప్రెగ్నెన్సీని సాంప్రదాయక పద్ధతిలో సెలబ్రేట్ చేశారు.ఇలా ఉపాసన స్నేహితులు చాలా సింపుల్ గా ఉపాసనకు బేబీ షవర్ వేడుకను నిర్వహించారు.ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బేబీ కమింగ్ సూన్ అంటూ అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఫోటోలలో ఉపాసన ప్రెగ్నెన్సీ గ్లోలో మెరిసిపోతున్నారు.ఇలా ఉపాసన స్నేహితులు చాలా సింపుల్ గా తనకు బేబీ షవర్ వేడుకను నిర్వహించి ఉపాసన తల్లి కాబోతున్నందుకు తన స్నేహితురాలు తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం ఉపాసన బేబీ షవర్ వేడుకకు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.