ఆ సినిమా షూటింగ్ సమయంలో.. చారు అన్నం తో గడిపారట నాగేశ్వరరావు?

అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా ఎంతగానో గుర్తింపు సంపాదించారూ అన్న విషయం తెలిసిందే.

 Unkown Facts About Akkineni Nageswar Rao Amarashilpi Jakkanna Movie Details, Akk-TeluguStop.com

అక్కినేని సినీ కెరీర్లో మైలురాయి లాంటి చిత్రం అమర శిల్పి జక్కన్న.తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటిసారి ఈస్ట్మన్ కలర్ లో తెరకెక్కిన చిత్రం ఇది ఇక ప్రతి శిల్పాన్ని ఎంతో సుందరంగా చెక్కి ఎంతగానో ప్రఖ్యాతి గాంచిన అమరశిల్పి జక్కన్న జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది అని చెప్పాలి.

బేలూరు హాలేబీడు దేవాలయాలను సందర్శించినా బి.ఎస్.రంగా అమరశిల్పి జక్కన జీవిత కథకు ఎంతగానో ఆకర్షితులయ్యారు.ఈ సినిమా కథ సినిమాల ఉంటే ఎంత బాగుంటుందో అని ఆలోచన చేశారు.బి.ఎస్.రంగా కేవలం ఛాయాగ్రహకుడు మాత్రమే కాదు విక్రమ్ ప్రొడక్షన్స్ అధినేత కూడా కావడం గమనార్హం.అప్పటివరకు తెలుగులో 9 సినిమాలు తీసి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు.కాగా ఈ కథ గురించి చెప్పగానే అక్కినేని వెంటనే నేను ఈ సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పారట.

సినిమాలో జక్కన్న తండ్రిగా నాగయ్య కుమారుడిగా హరినాథ్, గంగుల గా రేలంగి నటించారు.

జక్కన్న భార్యగా సరోజినీ దేవి నటించారు.

అయితే మద్రాసులో జెమినీ కలర్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అటు అమరశిల్పి జక్కన్న సినిమా మాత్రం ముంబైలోని కలర్ ల్యాబ్ ప్రాసెసింగ్ చేయించారు.

Telugu Akkineni, Anramarashilpi, Bs Ranga, Harinath, Sarojini Devi, Kalyankumar,

రంగ ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడ భాషల్లో కూడా నిర్మించారు.తెలుగులో అక్కినేని నాగేశ్వరరావుతో ఇక కన్నడలో కళ్యాణ్ కుమార్ తో ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం.ఇక ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం ఒకరే అని చెప్పాలి.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో కరెంటు లేని గ్రామాల్లో షూటింగ్ చేశారట.ఈ క్రమంలోనే అక్కినేని నాన్ వెజిటేరియన్ అయితే దూళిపాళ్ల ప్యూర్ వెజిటేరియన్.

ఇక రంగా వీరిని పట్టించుకోకపోవడంతో కొన్నాళ్లపాటు అన్నం చారుతో సరిపెట్టుకున్నారట.వీరికి ఇచ్చిన గెస్ట్ హౌస్ వాచ్ మెన్ తో అన్నం వండుకొని తిన్నారట రోజు రెండు గుడ్లతో కర్రీ ఇక చారు అన్నం తో సరిపెట్టుకునె వారట అక్కినేని నాగేశ్వరరావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube