తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టిన వారిలో కొంత మంది పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి.అలాంటి వారిలో నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఒకరు.
తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన సినిమాలు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు.
ఆయన నిర్మాణంలో వచ్చిన పది సినిమాలు కూడా ఒక గొప్ప కళా ఖండాలు అనే చెప్పాలి.అదుపుతప్పిన సినిమాలకు అసలు గతి నేర్పిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు.
పూర్ణోదయ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి తెలుగు చిత్ర పరిశ్రమకు ఖ్యాతిని నిలబెట్టిన వ్యక్తి ఆయన.
ఏప్రిల్ 24, 1934 లో గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు ఆయన.కాగా నేడు ఆయన 88వ జయంతి.ఈ క్రమంలోనే ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
శంకరాభరణం, సాగర సంగమం, స్వయంకృషి, స్వాతిముత్యం, ఆపద్బాంధవుడు, సీతాకోక చిలుక లాంటి ఎన్నో కళాత్మకమైన దృశ్య కావ్యాలు తెలుగు పక్షులను పలకరించేలా చేసి ఎనలేని సేవలు అందించిన గొప్ప నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. కాగా ఆయనకు కాలేజీ రోజుల నుంచి నాటక అనుభవం ఉంది.
ఈ క్రమంలోనే నటనపై ఆయన దృష్టి మళ్ళింది.దీంతో మద్రాసు రైలు ఎక్కారు.
కానీ అవకాశాలు రాక ఆయనకు నిరాశ మిగిలింది.
చివరికి చిన్నాచితకా వేషాలు వేస్తూ వచ్చారు.
ఇక 1976లో మిత్రుల ప్రోత్సాహంతో సిరిసిరిమువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతలు వహించారు.సినిమా సూపర్ హిట్ అయింది.ఇక ఇదే జోరులో పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు.ఇక ఈ నిర్మాణ సంస్థ ద్వారా మొదట ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా తాయారమ్మ బంగారయ్య మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో శంకరాభరణం సహా మరికొన్ని కళాత్మక దృశ్య కావ్యాలను ప్రేక్షకులకు అందించారు.ఇక జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా దక్కించుకున్నారు.
జాతీయ స్థాయిలో అవార్డు పొందిన మొట్టమొదటి చిత్రం స్వర్ణ కమలం ఇక ఏడిద నాగేశ్వరరావు నిర్మించినదే.సీతాకోకచిలుకలు ఇప్పటికి ఎంతో మంది దర్శకులకు ఆదర్శంగా నిలుస్తోంది.ఆ తర్వాత కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సాగరసంగమం కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఇలాంటి ఏడిద నాగేశ్వరరావు ను ప్రభుత్వం కనీసం పద్మశ్రీ కూడా ఇవ్వలేదు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు నామినేట్ అయ్యారు.కానీ అవార్డు రాలేదు మంచి చిత్రాలను తెరకెక్కించడానికి కోట్ల రూపాయల పైన పెట్టిన ఒక గొప్ప నిర్మాతకు ఇలాంటి గౌరవం ఏంటో అని ప్రేక్షకులు ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు.