జంతువులు ఒక్కోసారి అనుకోకుండా ఏదో ఒక ప్రమాదంలో చిక్కుకుతుంటాయి.అయితే ఇవి వాటంతట అవే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం చాలా కష్టం.
ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న జంతువులకు కొందరు గొప్ప మనసు చేసుకొని సహాయం చేస్తుంటారు.తాజాగా అలాంటి ఒక సంఘటన ఈక్వెడార్ లో చేసుకుంది.
భవన నిర్మాణం చేస్తున్న కొందరు వర్కర్లు కాలువలో పడిన కుక్కని గమనించారు.ఈ కాలవలో నీరు శరవేగంగా ప్రవహిస్తుండటంతో కుక్క వేగంగా కొట్టుకుపోసాగింది.
ఈ మూగ జీవిని కాపాడేందుకు కార్మికులు ఒక ప్లాన్ వేశారు.దీని కోసం వారు ఏకంగా ఓ జేసీబీని తెప్పించారు.
దానిలో ఒక వ్యక్తి కూర్చుని కాలువలో కొట్టుకుపోతున్న కుక్కని కాపాడాడు.
వైరల్ అవుతున్న వీడియోలో జేసీబీ బకెట్లో ఒక వ్యక్తి కూర్చుని ఉండటం చూడవచ్చు.
అతడు సరిగ్గా కాలువ నీటి పైన ఉన్నాడు.అయితే అదే కాలవలో అటువైపు నుంచి ఒక కుక్క కొట్టుకుంటూ వచ్చింది.
దీనిని అతడు చాలా తెలివిగా పట్టుకొని జేసీబీ బకెట్ లో కూర్చోబెట్టాడు.అనంతరం ఆ వాహనం డ్రైవర్ దానిని భూమి మీదకి తీసుకొచ్చాడు.
అయితే అప్పటి వరకు కాలవలోని నీటి ఉధృతికి ఉక్కిరి బిక్కిరి అయిన ఆ కుక్క భూమ్మీదికి రాగానే ఊపిరి పీల్చుకుంది.అంతేకాదు తడిసి ముద్దయిన తన శరీరాన్ని ఒక్కసారిగా గట్టిగా జాడించింది.
ప్రాణాపాయం తప్పడంతో అది సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఈ వీడియోని వైరల్ హాగ్ అనే ప్రముఖ వైరల్ వీడియోల షేరింగ్ పేజీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.దీన్ని చూసిన నెటిజన్లు కుక్కను రక్షించిన కన్‌స్ట్రక్షన్ వర్కర్లను పొగుడుతున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.
ఈ హార్ట్ టచింగ్ వీడియోని మీరు కూడా చూసేయండి.