నటుడు పృధ్వీరాజ్ జీవితంలో ఇంతటి విషాదం దాగి ఉందా ?

సినిమా ఇండస్ట్రీలో నటిస్తున్న వారి జీవితాలు బయటకు కనిపించేంత రంగుల ప్రపంచం కాదు.బయటకు ఎంతో హుందాగా, ఎంతో ఆకర్షణీయంగా కనిపించే నటీనటుల జీవితాల్లో కూడా అనేక చీకటి కోణాలు ఉంటాయి.

 Unknown Facts About Actor Babloo Prudhvi Raj Details,babloo Prithveeraj, Babloo-TeluguStop.com

వారి వ్యక్తిగత జీవితాల్లో అనేక బాధలు, కష్టాలు, నష్టాలు ఉంటాయి కానీ అవి బయట ప్రపంచానికి చాలా తక్కువగానే తెలుస్తూ ఉంటాయి.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే మంచి మాత్రమే బయటకు చూపించడానికి ఇష్టపడతారు.

వారిలో ఉండే బాధలను, కన్నీళ్లను లేదా కష్టాలను బయట ప్రపంచానికి చూపిస్తే వారిని చిన్నచూపు చూస్తారని భయం సెలబ్రిటీస్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన కూడా అలాంటి కోవలోకి వస్తుంది.

మలయాళ ఇండస్ట్రీ ద్వారా మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన నటుడు బబ్లీ పృథ్వీరాజ్ మనందరికీ సుపరిచితుడే.తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించే పృథ్వీరాజ్తొలినాళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత హీరోగా, మరికొంత కలం తర్వాత విలన్ గా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక ఇండస్ట్రీలోనే కాకుండా పలు భాషలలో రాణిస్తున్నాడు.అయితే పృథ్విరాజ్ జీవితంలో బయట ప్రపంచానికి తెలియని ఒక కన్నీటి పార్శం ఉందనే విషయం చాలా మందికి తెలియదు.1994లో పృథ్వీరాజ్ బీనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

వీరికి 1995లో అహెద్ మోహన్ జబ్బర్ అనే ఒక కుమారుడు జన్మించాడు.

Telugu Autism, Prudhvi Raj, Tamil-Movie

అయితే తొలినాల్లలో అహెద్ బాగానే ఉన్నప్పటికీ అతను ఆటిజం వంటి సమస్యలతో బాధపడుతున్నాడని రెండు మూడేళ్లకే తెలిసిపోయింది.ఇప్పటికీ ఐదేళ్ల వయసులో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటాడు వయసు పెరిగిన అతని మెదడు మాత్రం పెరగకపోవడంతో కంటికి రెప్పలా కాపాడు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.అహెద్ జన్మించిన తర్వాత అతని పరిస్థితి చూసిన బీనా, పృథ్వీరాజ్ మళ్లీ పిల్లల్ని కనడానికి కూడా ఇష్టపడలేదు.

అయితే పృథ్విరాజ్ కి తన కుమారుడి వల్ల కొన్ని సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.చిన్న వయసు నుంచి అతడు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్న అబ్బాయి కావడంతో అతడిని విమానంలో ఎక్కడానికి వైమానిక సిబ్బంది అనుమతించేవారు కాదు.

Telugu Autism, Prudhvi Raj, Tamil-Movie

అతడి వల్ల ఎవరికైనా హాని జరగవచ్చు అనే కారణంతో పలుమార్లు పృథ్వీరాజ్ కొడుకుని విమానంలోకి అనుమతి ఇవ్వలేదు.అనేకసార్లు ఈ విషయంపై సిబ్బందితో ఘర్షణ పెట్టుకునే వాడు పృద్వి.ఆటిజం పిల్లలు అంటే ఎవరిపైన అయిన దాడి చేస్తారని ఉద్దేశం ఉండడం నిజంగా బాధాకరమని పృద్వి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.ఇక బినా ఆటిజం పిల్లల కోసం ఏకంగా ఒక స్కూల్ ని ప్రారంభించి వారికి వీలైనంత సేవ చేస్తోంది.

తన కొడుకు లాగా మరెవ్వరు బాధపడకూడదని పృథ్విరాజ్, బీనా జంట అనేకమంది చిన్నపిల్లలని అందులో ముఖ్యంగా అటిజం పిల్లలని తమ స్కూల్ ద్వారా బాగు చేస్తున్నారు.కానీ 26 ఏళ్ల వయసు వచ్చిన తన కొడుకు ఇంకా చిన్న పిల్లాడిలా ఉండటం వారిని ఎంతగానో బాధకు గురిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube