‘పీఎం ఈ-బస్ సేవ’ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.దీని ద్వారా దేశవ్యాప్తంగా పదివేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కేంద్రం మొత్తం రూ.97,613 కోట్లు వెచ్చించనుందని తెలుస్తోంది.169 నగరాలు, పట్టణాల్లో ఛాలెంజ్ పద్ధతిలో ఈ-బస్ లను అందజేయనుంది.గ్రీన్ మొబిలిటీ కింద 169లో వంద పట్టణాలను చాలెంజ్ పద్ధతిలో ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.