ధర్మపురి' సినిమాలోని లిరికల్ సాంగ్ 'అయ్యయ్యో అయ్యాయ్యో'కు అనూహ్య స్పందన

తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్.

 Unexpected Response To The Lyrical Song 'ayyayo Ayyayo' From The Movie 'dharmapu-TeluguStop.com

ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ధర్మపురి.

1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు విశ్వజగత్.అక్కడ ఉండే రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.బీడీలు చుట్టుకునే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ ధర్మపురి.అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్.తాజాగా ఈ సినిమాలోని అయ్యాయ్యో అయ్యాయ్యో లిరికల్ సాంగ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది.

ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది.భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్న ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటులు:

గగన్ విహారి, అపర్ణ దేవి, నాగ మహేష్, జనార్దన్, కేశవ, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని తదితరులు.

టెక్నికల్ టీమ్:

రచన, దర్శకత్వం: విశ్వజగత్.సమర్పణ: శేఖర్ మాస్టర్.బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా.నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్.కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్.సంగీతం: ఓషో వెంకట్ PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube