తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.రైతులకు రెండు లక్షల రుణమాఫీ అసాధ్యమని తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు ఒకలా, ఇతర నేతలు మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
కొంతమంది తీరుతో పార్టీ, ప్రభుత్వానికి నష్టం వచ్చే అవకాశం ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.
తమ వియ్యంకుడి కుటుంబం ఎప్పటి నుంచో కాంట్రాక్టర్లుగా ఉన్నారని తెలిపారు.గందమల్ల రిజర్వాయర్ పనులను టెండర్ల ద్వారా వారు పొందారని పేర్కొన్నారు.
భూ సేకరణ ఆలస్యంతో ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయని వెల్లడించారు.ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు.