Twitterలో బ్లూ టిక్, గోల్డ్ టిక్, గ్రే టిక్ అని ఉంటాయి... ఇవి ఎందుకో తెలుసా?

ప్రముఖ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను యేముహుర్తాన టేకోవర్ చేసాడో గాని ఆనాటినుండి అనేక మార్పులు ఇందులో చోటుచేసుకున్నాయి.అంతవరకూ ట్విట్టర్ ని జనాలు వాడటం తప్ప పెద్దగా పట్టించుకొనేవారు.

 Twitter Has Blue Tick Gold Tick Gray Tick Do You Know Why-TeluguStop.com

ఆ తరువాతనే బ్లూ టిక్, గోల్డ్ టిక్, గ్రే టిక్ లాంటి టెర్మినాలజీని విరివిగా వినడం జరిగింది.అయితే గతంలో చూసుకుంటే కేవలం ట్విట్టర్ అకౌంట్లకు బ్లూటిక్ మాత్రమే ఉండేది.

బ్లూటిక్ ఉంటే వెరిఫైడ్ అకౌంట్ అని అర్థం చేసుకునేవారు కొంతమంది.వాటిని ప్రామాణికమైన అకౌంట్స్‌గా ట్విట్టర్ యూజర్లు అనేకమంది భావించేవారు.

కానీ ఇప్పుడు కొత్త కొత్త కలర్స్‌తో వెరిఫైడ్ అకౌంట్స్ కనిపిస్తున్నాయి.దాంతో ట్విట్టర్ యూజర్లు ఒకింత అయోమయానికి గురవుతున్నారు.అందుకే ఈ కలర్ బ్యాడ్జెస్‌కు అర్థమేంటో ఇపుడు తెలుసుకుందాం.‘ట్విట్టర్ బ్లూ’ అనేది పెయిడ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్.ఈ ఆప్షన్ తో ఎడిట్ ట్వీట్ లాంటి ఫీచర్స్‌కు ముందుగానే యాక్సెస్ పొందొచ్చు.ఇది వ్యాపారాలు తమ బ్రాండ్‌లను, ట్విట్టర్‌లోని ముఖ్య సిబ్బందిని గుర్తించడానికి ట్విట్టర్ ప్రారంభించిన కొత్త ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు.

ఇక గోల్డ్ టిక్ గురించి చెప్పాలంటే వెరిఫైడ్ బిజినెస్ అకౌంట్లకు గోల్డ్ చెక్ మార్క్‌తో అఫీషియల్ లేబుల్‌ను ట్విట్టర్ రీప్లేస్ చేసింది.స్విగ్గీ, జొమాటో వంటి సో కాల్డ్ వ్యాపార సంస్థలకు గోల్డ్ టిక్ చూడొచ్చు.ఇక గ్రే టిక్ గురించి చెప్పుకోవాలంటే ఇది వ్యక్తుల్ని, వ్యాపారాలను వేరు చేస్తూ ప్రభుత్వ ఖాతాలకు లభించే బ్యాడ్జ్ అని గుర్తుపెట్టుకోవాలి.అంటే ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వంలోని వ్యక్తులు, మల్టీలేటరల్ అకౌంట్స్ కోసం ట్విట్టర్ గ్రే చెక్ మార్క్ ఇస్తుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పీఎంఓ ఇండియా ట్విట్టర్ అకౌంట్లకు ఈ బ్యాడ్జ్ మనం గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube