అదానీ, అంబానీలలో ఇన్వెస్టర్లకు లాభాలు చూపించింది ఎవరంటే

ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఈ 2022 ఏడాదిలో బాగా సంపాదించారు.వారి కంపెనీలు ఊహించని రీతిలో లాభాలను ఆర్జించాయి.

 Adani And Ambanis Have Shown Profits To Investors ,adani, Ambani, Investers, P-TeluguStop.com

ముఖ్యంగా గౌతమ్ అదానీ సంపద రాకెట్ వేగంతో పెరిగింది.కొన్నాళ్ల క్రితం ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ రెండవ స్థానానికి చేరుకున్నాడు.

అయితే అదానీ, అంబానీలలో ఎవరు ఇన్వెస్టర్లకు అధిక లాభాలు చేకూర్చారో తెలుసుకుందాం.

అదానీకి చెందిన ఏడు కంపెనీలు ఇన్వెస్టర్లకు లాభాలు ఇబ్బడిముబ్బడిగా తీసుకొచ్చాయి.2022లో అదానీ పవర్ 163 శాతం లాభాలను ఆర్జించింది.అదానీ గ్రూపునకు చెందిన విల్మర్ కంపెనీ 86.25 శాతం లాభాలు, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 113 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 87.74 శాతం, గ్రీన్ ఎనర్జీ 35.88 శాతం, ట్రాన్స్‌మిషన్ 30 శాతం, అదానీ స్పోర్ట్స్ అండ్ సెజ్ 8.74 శాతం లాభాలను సాధించాయి.అయితే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది 5.65 శాతం రాబడిని అందించాయి.ఇతర అంబానీ కంపెనీలు మాత్రం నష్టాలను చవి చూస్తున్నాయి.ముఖ్యంగా హాత్‌వే 39 శాతం నష్టాలను మూటగట్టుకుంది.

జస్ట్ డయల్ 26 శాతం, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 20 శాతం, నెట్‌వర్క్ 18 మీడియా & ఇన్వెస్ట్‌మెంట్స్ 16 శాతం నష్టాలను పొందాయి.ఇన్వెస్టర్లకు రిలయన్స్ కంపెనీలు ఈ ఏడాది లాభాలను పంచలేకపోయాయి.ఇక టాటా కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఈ ఏడాది చక్కటి లాభాలు సమకూర్చింది.2022లో ఇండియన్ హోటల్స్ షేర్లు 65.69 శాతం, ట్రెండ్ స్టాక్ 20.56 శాతం లాభపడ్డాయి.మరో వైపు టీటీఎంఎల్ షేర్లు 60 శాతం, టీసీఎస్, వోల్టాస్, టాటా మోటార్స్ ఈ ఏడాది నష్టపోయాయి.వీటి తర్వాత దిగ్గజ కంపెనీ ఆదిత్య బిర్లా కూడా ఇన్వెస్టర్లకు లాభాలు పంచింది.బిర్లా క్యాపిటల్ 15.69 శాతం, ఫ్యాషన్ అండ్ రిటైల్ 4.90 శాతం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 5.34 శాతం ఇన్వెస్టర్లకు లాభాలు సమకూర్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube