నల్గొండ విషాద ఘటన వెలుగు చూసింది.మంచంపై పడుకున్న ఇద్దరు అన్నదమ్ములకు అతి కిరాతంగా చంపారు దుండగులు.
వీరిద్దరు గతేడాది అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిని చంపి జైలు శిక్షను కూడా అనుభవించారు ఈ ఇద్దరు అన్నదమ్ములు.బెయిల్ పై వచ్చిన వీళ్లను కొందరు దుండగులు పొడిచి చంపడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
నల్గొండ జిల్లా అనుముల మండలం హాజరీ గూడెంలో ఈ ఘటన చోట చేసుకుంది.పడుకున్న అన్నదమ్ములను గొడ్డళ్లతో పొడిచి చంపారు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.సత్యనారాయణ, జానపాటి అంజి ఇద్దరు అన్నదమ్ములు.గతేడాది హాలియకు చెందిన రేవంత్ అనే యువకుడిని కాపు కాసి సత్యనారాయణ, హరి, అంజి అనే ముగ్గురు అన్నదమ్ములు హత్య చేశారు.వీరిలో హరి అనే వ్యక్తి భార్యతో రేవంత్ కి అక్రమసంబంధం ఉంది.
ఈ కారణంగానే హత్య చేయడంతో శిక్షను కూడా అనుభవించారు.బెయిల్ పై వచ్చిన విషయం తెలిసి రేవంత్ తల్లి ఇందిర, మరో ఇద్దరి సాయంతో నిన్న ముగ్గురిని చంపడానికి వెళ్లారు.
పడుకున్నప్పుడు గొడ్డళ్లతో పొడిచి చంపారు.దీంతో సత్యనారాయణ, అంజి మృతి చెందారు.
కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు వెల్లడించారు.