దేశవాళీ మరియు అంతర్జాతీయ క్రికెట్ ఆటలో భారత క్రికెట్ జట్టుకు తన ఎనలేని సేవలు అందించినటువంటి క్రికెట్ లెజెండ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వారుండరు.క్రికెట్ ఆటలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేయడమే కాకుండా తన కెరియర్ లోనే వంద సెంచరీలు చేసిన మొట్టమొదటి ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయింది.
అయితే ఇటీవలే స్నేహితుల దినోత్సవ సందర్భంగా సచిన్ టెండూల్కర్ తన చిన్ననాటి స్నేహితులను గుర్తు చేసుకుంటూ ఓ ఫోటోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు.భాగంగా తన స్నేహితులందరికీ జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.
అంతేకాక తన స్నేహితులతో ఉన్నటువంటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.ఈ ఫోటోని షేర్ చేసిన కొద్దిసేపటిలోనే దాదాపుగా లక్షలకి పైగా లైకులు, కామెంట్లు వచ్చాయి.
అంతేగాక ఈ ఫోటోని సచిన్ టెండూల్కర్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు.
అలాగే కొందరు ప్రముఖ క్రికెట్ జట్టు ఆటగాళ్లు కూడా సచిన్ టెండూల్కర్ కి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా సచిన్ టెండూల్కర్ మాత్రం ఇప్పటి తరం క్రికెటర్లకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాడు.అలాగే మరో వైపు తన కొడుకు అర్జున్ టెండూల్కర్ ని భారత క్రికెట్ జట్టులోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాడు.