వెంకన్న స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల కొండపై గదుల కోసం వెయిటింగ్ చెక్..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి.తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామి కొండ సంగతి అందరికి తెలిసిన విషయం.

 Ttd Eo Jawahar About Online Darshan Tickets, Ttd, Thirumala, Devotees, Good News-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుత కాలంలో వెంకన్న స్వామిని దర్శించుకోవాలి అంటే చాలా సమయం వెచ్చించవలసివస్తుంది.ఇక్కడి దేవాలయం నిత్యకల్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతుంది.

అందువల్ల ఎప్పుడు చూసినా భక్తులు లక్షల లోనే ఉంటారు.ఇక్కడ రూము దొరకాలన్న కూడా మనము కళ్లు కాయలు కాచేలా వేచి ఉండాలి.

ప్రస్తుతం తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పదలచుకున్నది.గదుల కోసం ఇకపై ఎదురు చూసే అవసరము భక్తులకు కలగకుండా ఉండాలని ఆలయ ఈవో జవహర్ రెడ్డి డయల్ యువర్ ఈఓ అనే కార్యక్రమంలో తెలియజేశారు.

ఆన్లైన్ లో గదులు ముందుగా బుకింగ్ చేసుకున్న భక్తులు ప్రస్తుతము తిరుమలలోని సిఆర్వో ఆఫీసుకు వెళ్లి అక్కడి నుంచి సబ్ ఎంక్వయిరీ కార్యాలయానికి చేరుకుని గదులు పొందుతున్నారు.ఈ ప్రక్రియ కోసము చాలా సమయము వృధా అవుతున్నది.

అందుకే ఈవో జవహర్ రెడ్డి గారు ఈ పద్ధతిలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


ఇక నుంచి తిరుమలకు వచ్చే భక్తులు టికెట్లు అలిపిరి చెక్ పాయింట్ వద్ద స్కాన్ చేసిన వెంటనే మొబైల్ నంబర్లకు మెసేజ్ ద్వారా సబ్ ఎంక్వయిరీ ఆఫీస్ వివరాలు తెలియజేస్తామన్నారు.

భక్తులు నేరుగా ఆ కార్యాలయానికి వెళ్లి గదులు పొందవచ్చునని చెప్పారు. ఆన్ లైన్ లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు తీసుకునే భక్తులు అదే స్క్రీన్ పై గదులను బుక్ చేసుకునే విధంగా కూడా దేవస్థానము వెబ్ సైట్ లో పలు మార్పులు తీసుకువస్తామని ఈఓ తెలియజేశారు.


Telugu Devotees, Key, Rooms, Thirumala, Ttd Chairman, Ttdeo-Latest News - Telugu

ఈ నెల 13న “ప్లవ”నామ సంవత్సర ఉగాది పండుగ పర్వదినాన్ని కూడా ఘనంగా నిర్వహించుతామని ఆలయ ఈవో ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ నెల 24 నుంచి 26 వరకు తిరుమల వసంత మండపంలో స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.ఈ సదుపాయాన్ని రాబోయే పది రోజుల తర్వాత నుండి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.భక్తులు స్వామివారి దర్శనార్థం 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకునే సమయం లోనే స్క్రీన్ పై రూం ల వివరాలు కూడా తెలిపే విధంగా సాఫ్ట్వేర్ రూపొందించ బోతునట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube