చెన్నైలోని మనలిలో విషాద ఘటన చోటు చేసుకుంది.ఇంటిలో ఉన్న దోమల మందు లిక్విడ్ బాటిల్ పేలడంతో నలుగురు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది.
మృతుల్లో ముగ్గురు చిన్నారులతో పాటు ఓ వృద్ధురాలు ఉన్నారు.నిద్రమత్తులో ఉన్న సమయంలో దోమల మందు లిక్విడ్ బాటిల్ పేలినట్లు తెలుస్తోంది.
లిక్విడ్ వాసనకు ఊపిరి ఆడకపోవడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని సమాచారం.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కుటుంబంలో నలుగురు దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.దీంతో మనలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.