టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో ప్రమాదం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది.వేగంగా వెళుతున్న కాన్వాయ్ లో 6 కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.

 Tpcc President Revanth Reddy Was Traveling In An Accident ,tpcc President Revant-TeluguStop.com

అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్ లు ఓపెన్ కావడంతో రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది.ఈ ప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద చోటుచేసుకుంది.

ప్రమాదానికి గురైన కార్లలో రెండు కార్లలో మీడియా ప్రతినిధులు ఉన్నారు.వీటిలో టీవీ9, ఎన్టీవీ, సాక్షి, ఏబీఎన్, బిగ్ టీవీ న్యూస్ నౌ రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం.

సిరిసిల్ల రిపోర్టర్లయిన వీరంతా స్వల్ప గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది.ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube