టాలీవుడ్ స్టార్స్ గత 5 సినిమాల గ్రాస్ కలెక్షన్లు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ హీరోలలో చాలామంది హీరోలకు ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు ఉంది.ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాల కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ఇతర రాష్ట్రాల ప్రేక్షకులు సైతం అదే స్థాయిలో ఎదురుచూస్తున్నారు.

 Tollywood Star Heroes Last 5 Movies Gross Collections Details Here Goes Viral In-TeluguStop.com

ఈ స్టార్ హీరోల సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

టాలీవుడ్ స్టార్ హీరోల గత 5 సినిమాల గ్రాస్ కలెక్షన్లను పరిశీలిస్తే ఈ జాబితాలో ప్రభాస్ ముందువరసలో ఉంటారు.

ప్రభాస్ గత 5 సినిమాల కలెక్షన్లు ఏకంగా 3143 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఈ స్టార్ హీరో గత 5 సినిమాల కలెక్షన్లు ఏకంగా 1691 కోట్ల రూపాయలు కాగా మరో స్టార్ రామ్ చరణ్ గత5 సినిమాల గ్రాస్ కలెక్షన్లు 1576 కోట్ల రూపాయలుగా ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత 5 సినిమాల గ్రాస్ కలెక్షన్లు 954 కోట్ల రూపాయలు కాగా మహేష్ బాబు గడిచిన 5 సినిమాల గ్రాస్ కలెక్షన్లు 867 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.ఇతర స్టార్ హీరోల విషయానికి వస్తే శ్ గత 5 సినిమాల గ్రాస్ కలెక్షన్లు 1628 కోట్ల రూపాయలు కాగా రజనీకాంత్ గత 5 సినిమాల గ్రాస్ కలెక్షన్లు 1457 కోట్ల రూపాయలుగా ఉండగా విజయ్ లాస్ట్ 5 సినిమాల గ్రాస్ కలెక్షన్లు 1289 కోట్ల రూపాయలుగా ఉంది.కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గత 5 సినిమాల గ్రాస్ కలెక్షన్లు 911 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.టాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిందో ఈ సినిమాల కలెక్షన్లు ప్రూవ్ చేస్తున్నాయి.

టాలీవుడ్ స్టార్స్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా రికార్డులు క్రియేట్ చేయడంతో 5000 కోట్ల రూపాయల స్థాయికి మార్కెట్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube