రాజకీయ కథలకు జై కొడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. కారణమిదేనా?

టాలీవుడ్ స్టార్స్ అందరూ ప్రస్తుతం పాన్ ఇండియా కథలపై దృష్టి పెట్టారు.బాలీవుడ్ లో హిట్ టాక్ ను సొంతం చేసుకున్న తెలుగు సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రధానంగా బాలీవుడ్ మార్కెట్ పై దృష్టి పెట్టారు.

 Tollywood Star Heroes Green Signal For Political Movies But , Tollywood , Sta-TeluguStop.com

బాలీవుడ్ లో తమ సినిమా సక్సెస్ సాధిస్తే అంచనాలకు అందని స్థాయిలో కలెక్షన్లు వస్తాయని హీరోలు నమ్ముతున్నారు.

ప్రస్తుతం స్టార్ హీరోలు కొత్త కథలను ఎంచుకోవడంతో పాటు పీరియాడికల్ కథలపై దృష్టి పెట్టారు.

అయితే ఎక్కువమంది స్టార్ హీరోలు ప్రస్తుతం పొలిటికల్ కథలలో నటించడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ పొలిటికల్ యాక్షన్ సినిమా కావడం గమనార్హం.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.నయనతార ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటిస్తున్నారు.

కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో తారక్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తారని పాలిటిక్స్ తో ఈ సినిమాకు సంబంధం ఉంటుందని తెలుస్తోంది.చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటిస్తున్నారు.

నితిన్ నటిస్తున్న ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం గమనార్హం.ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.కృతిశెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ స్టార్స్ అంతా వరుసగా పొలిటికల్ కథలపై దృష్టి పెట్టారు.పొలిటికల్ కథలు భాషతో సంబంధం లేకుండా సక్సెస్ సాధించే ఛాన్స్ ఉండటంతో హీరోలు ఈ కథలపై దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube