తెలుగు సినీ పరిశ్రమకు ఎలాంటి సినిమా కుటుంబం బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన టువంటి మాస్ మహారాజా రవితేజ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే రవితేజ సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను బాగా అలరించాడు.
ఆ తరువాత టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించినటువంటి “నీ కోసం” అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు.చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో పాటు రవి తేజకి పలు చిత్రాలలో హీరోగా నటించే అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.
అయితే ఇప్పటి వరకు హీరో రవితేజ భార్య గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు. ఇప్పుడు ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
హీరో రవితేజ భార్య పేరు కళ్యాణి భూపతి రాజు. ఈమె ఎవరో కాదు ఈ రోజు రవితేజ తల్లి సోదరుడి కూతురు.అలాగే కళ్యాణి స్థానికంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో డిగ్రీ వరకు చదువుకుని ఆ తర్వాత హీరో రవి తేజతో కుటుంబ సభ్యులు పెళ్లి చేయడంతో కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడింది.ఈ క్రమంలో రవితేజ వరుస ఫ్లాపులలో ఉన్నప్పుడు ఆమె ఎంతగానో ధైర్యం చెబుతూ తనకు అండగా నిలిచింది.
దీంతో పలు సందర్భాలలో తన సినీ జీవితంలో విజయం సాధించడానికి కారణం తన భార్య కళ్యాణి అని రవి తేజ చెప్పుకొచ్చాడు. కాగా రవితేజ కి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
వారి పేర్లు మహాదాన్ భూపతిరాజు, మొక్షద భూపతిరాజు.అయితే రవి తేజ భార్య కల్యాణి మాత్రం ఎలాంటి సినిమా ఫంక్షన్లకి లేదా సినిమా పరిశ్రమ జరిగినటువంటి వేడుకలకు హాజరు కాలేదు అందువల్లే ఈమె గురించి ఎవరికీ తెలియదు.
అంతేగాక తన నిజ జీవితంలో కూడా కళ్యాణి చాలా నిరాడంబరంగా ఉంటుంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరో రవి తేజ తెలుగులో “క్రాక్” అనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే ఈ చిత్రంలో రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ “శృతి హాసన్” హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ సీనియర్ నటుడు కూతురు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అంతేగాక ఈ విషయంపై ఇటీవలే అధికారికంగా ప్రకటన కూడా చేశారు.