తెలుగులోప్రముఖ సీనియర్ దర్శకుడు “ముత్యాల సుబ్బయ్య” దర్శకత్వం వహించినటువంటి “తొలి వలపు” అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన టాలీవుడ్ ప్రముఖ యాక్షన్ హీరో “గోపీచంద్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే గోపీచంద్ తన మొదటి ఈ చిత్రంతో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టున్నప్పటికీ ఎందుకో హీరోగా సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఇప్పుడు హీరో గోపీచంద్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
అయితే ఇప్పటి వరకు చాలామంది సినీ ప్రేక్షకులకు హీరో గోపీచంద్ హీరో గానే తెలుసు.
కానీ గోపీచంద్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం, వందేమాతరం, తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు తొట్టెంపూడి కృష్ణ తనయుడని చాలా మందికి తెలియదు.అంతేకాక గోపీచంద్ ఇతర దేశాల్లో తన చదువుని పూర్తి చేసినప్పటికీ సినిమాలపై ఉన్నటువంటి మక్కువతో లక్షల జీతాన్ని వదులుకుని సినిమా పరిశ్రమకి వచ్చాడు.
ఈ క్రమంలోనే ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహిస్తున్న తొలి వలపు చిత్రంలో హీరోగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.అయితే హీరోకి గోపీచంద్ తన సినీ కెరీర్ మొదలైన కొత్తలో కేవలం హీరోగానే మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించి ప్రేక్షకులని బాగానే మెప్పించాడు.
ఇందులో భాగంగా గోపీచంద్ విలన్ గా నటించిన జయం, నిజం తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.కాగా 2013 వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మ ని పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం వీరికి ఒక పాప కూడా ఉంది.
అయితే ఈ మధ్య కాలంలో గోపీచంద్ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.కాగా ప్రస్తుతం తెలుగులో టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న “సీటీమార్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండటంతో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు. అలాగే ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్న ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.