వ్యాక్సిన్ వేయించుకున్న అనుపమ.. ఎంత క్యూట్ ఉందో?

టాలీవుడ్ బ్యూటీ కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు అందుకున్న ఈ బ్యూటీ తన అందంతో యువత మనసులను దోచుకుంది.

 Tollywood Actress Anupama Gets Vaccine, Tollywood, Anupama Parameswaran, Gat Vac-TeluguStop.com

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అనుపమ స్టార్ హీరోల సరసన కూడా నటించింది.తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా నటించింది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలు, ఫన్నీ వీడియోలు బాగా షేర్ చేస్తూ ఉంటుంది అనుపమ.ఇండస్ట్రీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ అందుకుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా ముచ్చటిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ వ్యాక్సిన్ వేయించుకుంది.ప్రస్తుతం చాలా మంది హీరోయిన్స్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోగా తమ వ్యాక్సినేషన్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇక తాజాగా ఈ కేరళ కుట్టి కూడా వ్యాక్సిన్ వేయించుకోగా తను వ్యాక్సిన్ వేయించుకుంటున్న ఫోటోలు తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు.

పైగా ఎంతో క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Covid, Gat Vaccine, Tollywood-Movie

ఇప్పటివరకు తన గ్లామర్ డోస్ ని ఇంకా పరిచయం చేయలేని ఈ బ్యూటీ ఎప్పుడు సింపుల్ గానే ఉంటూ తన స్మైల్ తో యువతను మాయ చేస్తుంది.ఇక వ్యాక్సినేషన్ కోసం వచ్చిన ఈ బ్యూటీ మాస్క్ వేసుకొని రింగుల జుట్టు తో అమాయకంగా ఉన్న ముఖం తో కనిపించేసరికి ఎంత ముద్దుగా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో తెరకెక్కనుంది.ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube