Durga Rao : ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో ఆ టిక్ టాక్ స్టార్ ఎంట్రీ ఖాయం.. ప్రూఫ్ ఇదే?

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్( Big Boss ) ఇప్పటికే తెలుగులో 6 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కూడా ప్రారంభం కానుంది.

 Tiktok Durga Rao All Set To Entry Into Bigg Boss 7 Telugu House-TeluguStop.com

ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించి రెండు ప్రోమోలను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈసారి మాత్రం ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అని తెలుస్తోంది.

సరికొత్త రూల్స్,సరికొత్త గేమ్స్ ఇలా అన్నీ కొత్తగా ఉండబోతున్నాయని ఇప్పటికే నాగార్జున( Nagarjuna ) తెలిపిన విషయం తెలిసిందే.ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించిన కంటెస్టెంట్ లపై ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Bigg Boss, Tollywood-Movie

గత కొద్ది రోజులుగా ఈ కంటెస్టెంట్ల విషయంపై అనేక రకాల వార్తలు వినిపించడంతో పాటు పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.ఈసారి హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారా అని ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే పలువురు కంటెస్టెంట్ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈసారి మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అయిన ఒక సెలబ్రిటీ రావడం మాత్రం పక్క అని తెలుస్తోంది.

ఆ సెలబ్రిటీ మరెవరో కాదు.టిక్ టాక్ దుర్గారావు( Tik Tok Durga Rao ).గత సీజన్ లోనే టిక్ టాక్ దుర్గారావు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ వట్టి రూమర్సే అని తేలిపోయాయి.

Telugu Bigg Boss, Tollywood-Movie

కానీ ఈసారి మాత్రం దుర్గారావు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది.ఇదే విషయాన్ని దుర్గారావు స్వయంగా వెల్లడించారు.ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న దుర్గారావు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.

తనకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చిందని, బిగ్ బాస్ 7లో తనను ఎంపిక చేసామని వారు చెప్పినట్లు తెలిపాడు.కానీ తనను ఒక్కడినే రమ్మన్నారని కేవలం ఒక్కరికి మాత్రమే ఛాన్స్ అని చెప్పారని దానికి తాను ఒప్పుకోలేదని అతడు వివరించాడు.

టిక్ టాక్ ద్వారా తనకు చాలా పేరు వచ్చింది కానీ తనతో పాటు భార్య లేకపోతే నాకు ఈ పేరు వచ్చేది కాదని అతడు స్పష్టం చేశాడు.ఏం చేసినా తామిద్దరం కలిసి చేస్తామని బిగ్ బాస్‌లో కూడా ఇద్దరికీ ఛాన్స్ ఇవ్వాలని కోరినట్లు వెల్లడించాడు దుర్గారావు.

దానికి బిగ్ బాస్ వాళ్ళు ఎలా స్పందించారు? ఓకే చెప్పారా? లేక మరొకర్ని సెలక్ట్ చేసుకున్నారా అన్నది త్వరలో తేలనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube