కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి పోయింది.థర్డ్ వేవ్ అంటున్నారు కాని అది ఎప్పటికి వస్తుంది అనేది క్లారిటీ లేదు.
వచ్చినా ఇంత ప్రభావం ఉంటుంది.అంత ప్రభావం ఉంటుందనే పుకార్లే కాని క్లారిటీ లేదు.
కనుక మళ్లీ థియేటర్లను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.జులై చివరి వరకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ప్రారంభం కాబోతున్నాయి.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లు ప్రారంభం అయ్యాయి.కాని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం థియేటర్ల విషయంలో కాస్త వెనుక ముందు ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది.
అందుకే తెలుగు లో రూపొందిన సినిమాలు విడుదలకు జులై సరైన సమయం కాదని భావిస్తున్నారు.అందుకే జులై నెలలో పెద్దగా సినిమాలు ఏమీ రావడం లేదు.
కాని ఆగస్టు లో మాత్రం మోస్ట్ క్రేజీ సినిమాలు వస్తాయని అంటున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మూడు ప్రధానంగా ఆగస్టులో రాబోతున్నాయి.
అక్కినేని హీరో నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా ను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లవ్ స్టోరీ సినిమా ను ఆగస్టు 7వ తారీకున విడుదల చేస్తారట.
ఆ తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.ఆగస్టు 13వ తారీకున మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ను విడుదల చేస్తారట.
ఇక అదే నెలలో నాని నటించిన టక్ జగదీష్ సినిమాను విడుదల చేయబోతున్నారు.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా గత ఏడాదిలోనే రావాల్సి ఉంది.కాని కరోనా కారణాల వల్ల వాయిదా పడింది.ఈ ఏడాది ఆరంభంలో విడుదల అనుకున్నా కూడా సెకండ్ వేవ్ వచ్చింది.
ఈ మూడు సినిమాలు ఆయా హీరోలకు అత్యంత కీలకంగా మారాయి.ఇక నిర్మాతలు మరియు దర్శకులు మాత్రం ఆయ సినిమాలపై చాలా నమ్మకంతో ఉన్నారు.
కనుక ఈ సినిమాలు తప్పకుండా విజయాలను దక్కించుకుంటాయేమో చూడాలి.