రామ్ చరణ్ ( Ram Charan )హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.నిజానికైతే ఈ సినిమాని డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు.
కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలపాలిసి వచ్చింది.మరి ఇప్పటివరకు ఈ సినిమా కు సంభందించిన చూపించిన ప్రమోషన్స్ ను చేపట్టడం లేదు.

ఇక నవంబర్ చివరి వారం నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ రేంజ్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా దిల్ రాజు( Dil Raju) రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలు తెలియజేశారు.మరి మొత్తానికైతే దిల్ రాజు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే భారీగా అమౌంట్ ని కూడా దీని మీద కేటాయించాడు.మరి దిల్ రాజుకు భారీ లాభాలు తీసుకొచ్చి పెట్టాలంటే మాత్రం ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించాల్సిన అవసరం అయితే ఉంది.
ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడమే కాకుండా తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి చాలా వరకు ఉత్సాహం చూపిస్తున్నాడు.

ఇక శంకర్ విషయానికి వస్తే ఆయన రీసెంట్ గా ‘భారతీయుడు 2‘ సినిమాతో ఢీలా పడ్డాడు.కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి మరోసారి పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక మొత్తానికైతే ఈ ముగ్గురికి ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకంగా మారింది.కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు అడుగేయాల్సిన అవసరం అయితే ఉందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
.