మూడు రాజధానులు ప్రభుత్వ విధానం.అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానుల వల్ల ఉపయోగాలు స్పష్టంగా చెప్పారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష.రాజధాని ఎక్కడ పెట్టాలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన హక్కు.
చంద్రబాబు అమరావతి పేరుతో రాజకీయం చేస్తున్నారు.మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
అమరావతి రైతుల పాదయాత్రకు కర్త,కర్మ,క్రియ చంద్రబాబే.అమరావతి పాదయాత్ర వల్ల ఎలాంటి గొడవలు జరిగినా అందుకు చంద్రబాబుదే బాధ్యత.
రాష్ట్రంలో వచ్చే ఏడాది ఐదు మెడికల్ కాలేజీల ద్వారా కొత్తగా 700 సీట్లు పెరగనున్నాయి.చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ రాష్ట్రానికి తీసుకురాలేదు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు.ఎక్కడో ఏదో జరిగితే రాజకీయాలకు సంబంధంలేని సీఎం జగన్ భార్య భారతిపై టీడీపీ ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదు.