నాని స్టార్ హీరో అనిపించుకునే ఛాన్స్ లేదా.. ఆ తప్పు వల్లే అంటూ?

కొంతమంది హీరోలకు స్టార్ హీరో అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నా వేర్వేరు కారణాల వల్ల స్టార్ హీరో అనిపించుకోవడం సాధ్యం కాదనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం హీరో నాని సైతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

 This Is The Biggest Mistake For Hero Nani Carer Details Here Goes Viral , Bigges-TeluguStop.com

వరుస విజయాలతో కొన్నేళ్ల క్రితం డబుల్ హ్యాట్రిక్ సాధించిన నాని ప్రస్తుతం 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడంలో సైతం ఫెయిల్ అవుతుండటం గమనార్హం.

నాని స్టార్ హీరో అనిపించుకునే ఛాన్స్ లేదా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కథల ఎంపికలో చేస్తున్న తప్పులు నాని కెరీర్ కు మైనస్ అవుతున్నాయి.వీ, టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలు నాని ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి.

ఒక్కో సినిమాకు నాని 12 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటుండగా ఆ రెమ్యునరేషన్ కు తగిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.

నాని ప్రస్తుతం దసరా సినిమాలో నటిస్తున్నారు.

శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో అంచనాలు పెరగలేదు.దసరా పండుగ కానుకగా ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తుండగా నానికి జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం.

నాని స్టార్ డైరెక్టర్లపై దృష్టి పెట్టకపోవడం కూడా కెరీర్ కు మైనస్ అవుతోంది.

Telugu Biggest, Career Troubles, Nani, Shyam Singharoy, Srikanth Odela-Movie

స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నాని నటిస్తే డైరెక్టర్ గా ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఎంసీఏ తర్వాత నాని నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.నాని సినిమాలకు బిజినెస్ బాగానే జరుగుతున్నా బయ్యర్లకు మాత్రం నష్టాలు మిగులుతున్నాయి.

నాని కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube