టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప నటులలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే.400కు పైగా సినిమాలలో నటించిన సీనియర్ ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా ఇతర రంగాలలో కూడా సత్తా చాటారు.తెలుగు వారి హృదయాలలో సీనియర్ ఎన్టీఆర్ దైవంగా నిలిచారు.తన సినీ కెరీర్ లో సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో వైవిధ్యభరిత పాత్రలలో నటించి నటుడిగా మెప్పించారు.అయితే సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఒక సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.
ఆ సినిమా సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కూడా అస్సలు నచ్చలేదు.
ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో రికార్డులు సాధించిన సినిమాలు ఉన్నాయి.కాడెద్దులు ఎకరం నేల పేరుతో తెరకెక్కి 1960 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
సీనియర్ ఎన్టీఆర్ ఆ ఏడాది నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు హిట్లుగా నిలిచాయి.జంపన ఈ సినిమాకు డైరెక్టర్ కాగా పొన్నలూరి బ్రదర్స్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు.
షావుకారు జానకి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా సినిమాలో రైతు పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు.

కాడెద్దులు ఎకరం నేల సినిమాలోని ఏ సీన్ ప్రేక్షకులకు నచ్చలేదు.ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా ఒకరోజు మాత్రమే ఆడిందని బోగట్టా.కాడెద్దులు ఎకరం నేల ఫ్లాప్ సీనియర్ ఎన్టీఆర్ ను చాలా బాధపెట్టిందని సమాచారం.
సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో చాలామందికి ఈ సినిమా గురించి అస్సలు తెలియదు.

ప్రముఖ థియేటర్లలో సైతం ఈ సినిమా ఒక్కరోజుకు పరిమితం కావడం గమనార్హం.అయితే ఫ్లాప్ వచ్చినా తక్కువ సమయంలోనే మరో సక్సెస్ సాధించి ఎన్టీఆర్ ఇతర హీరోలకు గట్టి పోటీ ఇచ్చేవారు.సీనియర్ ఎన్టీఆర్ సినిమాలలో చాలా సినిమాలు కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టించాయి.