మణప్పురంకి షాకిచ్చిన దొంగలు... కేవలం 18 నిమిషాల్లో రూ.14 కోట్లు స్వాహా!

మణప్పురం గోల్డ్ గురించి అందరికీ తెలిసినదే.ఈరోజున దాదాపు అందరూ తమ అవసరాల నిమిత్తం తమవద్దనున్న బంగారాన్ని తాకట్టు పెట్టడానికి బ్యాంకుల తరువాత మణప్పురంనే ఆశ్రయిస్తున్నారు.

 Thieves Who Shocked Manipuram Stole Rs. 14 Crores In Just 18 Minutes ,manipuram-TeluguStop.com

ఈ క్రమంలో మణప్పురం ఆఫీసులు ప్రతి పల్లెల్లో, పట్టణాలలో వెలిసాయి.అయితే అదే అదనుగా చూసుకొని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.

ఇటీవలకాలంలో మణప్పురంలో అనేక చోట్ల దొంగతనాలు జరుగుతుండటం మనం చూశాం.తాజాగా అలాంటి ఓ సంఘటనే జరిగింది.

బ్యాంకులను దోచేస్తున్న దోపీడిగాళ్ళు కేవలం నిమిషాల వ్యవధిలోనే కోట్ల రూపాయల విలువ చేసే సొమ్ము కాజేసి అంతే స్పీడ్ గా పారిపోతున్నారు.

తాజాగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో భారీ దోపిడీ జరిగింది.ఇక్కడ కేవలం 18 నిమిషాల్లో రూ.14 కోట్లు విలువ చేసే నగలను దోచుకుపోయారు దొంగలు.ఈ సీన్ అచ్చం ఓ తెలుగు సినిమా చూసిన మాదిరి మనకు అనిపిస్తుంది.ఉదయ్ పూర్ లోని సుందర్ వాస్ లోని మణప్పురం గోల్డ్ బ్యాంక్‌లో కొందరు దుండగులు ప్రవేశించి.

పిస్టళ్లతో బెదిరించి.చోరీకి పాల్పడ్డారు.సోమవారం అనగా ఆగస్టు 29 ఉదయం 9.20 గంటలు ప్రాంతంలో కొందరు ముసుగు దొంగలు బైక్ లపై వేగంగా వచ్చి ఓ భవనం ముందు ఆగారు.చేతిలో మారణాయుధాలతో అంతే వేగంగా మణప్పురం గోల్డ్ బ్యాంక్ వున్న భవనంలోకి దూసుకెళ్లారు.

Telugu Minutes, Latest, Manipuram Gold, Rajasthan, Theif Latest, Udaipur-Latest

వెళ్లీవెళ్లడంతోనే రెప్పపాటులో మేనేజన్ పై దాడి చేశారు.సిబ్బంది కాళ్లు చేతులు ఎటూ కదలకుండా ఉండటానికి కట్టేసారు.అలా 18 నిమిషాల పాటు ఆగంతకులు దాదాపు రూ.14 కోట్ల విలువైన బంగారు నగలు రూ.10 లక్షల నగదు దోచుకుపోయారు.కాగా ఉదయ్ పూర్ లోనే అత్యంత భారీ దోపిడీగా దీనిని పోలీసులు అభివర్ణిస్తున్నారు.తర్వాత నిమిషాల వ్యవధిలో వారు అక్కడ నుంచి మాయమయ్యారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు.వెంటనే నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube