మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి ప్లాప్ అయిన హీరోలు వీళ్ళే...

ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది యంగ్ హీరోలు వాళ్ల ఇమేజ్ కి తగ్గట్టు కథలను ఎంచుకుంటే మంచింది అంటూ చాలా మంది సీనియర్ నటులు చెప్తున్నారు.ఇదంతా దేని కోసం చెప్తున్నారు అని అనుకుంటున్నారా.? ఇండస్ట్రీ లో ఉన్న కొంత మంది హీరోల గురించి చెప్తున్నాం…వాళ్ళు హిట్లతో సంబందం లేకుండా ఎప్పుడూ మాస్ ఇమేజ్ రావడం కోసం తెగ ట్రై చేస్తూ ఉంటారు.నిజానికి వాళ్ళకి సెట్ అయ్యే సినిమాలు చేస్తూ ఉండాలి కానీ ఎప్పుడూ మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేయడం కరక్ట్ కాదు అంటూ చాలా మంది ట్రేడ్ పండితులు సైతం చెప్తూ ఉంటున్నారు.

 These Are The Heroes Who Tried For Mass Image And Failed, Naga Chaitanya, Adi,-TeluguStop.com

అలా మాస్ సినిమాల కోసం ట్రై చేసి చేతులు కాల్చుకున్న నటులు ఎవరి ఒకసారి మనం తెలుసుకుందాం.

నాగచైతన్య ( Naga Chaitanya )అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో గా నాగ చైతన్య కి ఇండస్ట్రీ లో మంచి ఇమేజ్ ఉంది అయితే కెరియర్ మొదట్లో మంచి క్లాస్ సినిమాలు చేసిన ఆయన ఆ తరవాత బెజవాడ, దడ అనే మాస్ సినిమాలు చేశాడు అవి డిజాస్టర్ కావడంతో మళ్ళీ క్లాస్ సినిమాలు చేస్తున్నాడు… ప్రస్తుతం ఆయన చందు మొండేటి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

 These Are The Heroes Who Tried For Mass Image And Failed, Naga Chaitanya, Adi,-TeluguStop.com

ఇక ఈయన తర్వాత మాస్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోల్లో ఆది( Adi ) ఒకరు…ఈయన కెరియర్ మొదట్లో ప్రేమ కావాలి, లవ్లీ వంటి మంచి క్లాస్ సినిమాలు తీసిన ఈయన ఆ తర్వాత మాత్రం మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి గరం అనే సినిమా చేశాడు.ఈ సినిమా ప్లాప్ అయింది ఇక దానితో మళ్ళీ క్లాస్ సినిమాలే చేస్తున్నాడు…అయిన కూడా ఈయన చేసిన ఒక్క సినిమా కూడా హిట్ కావడం లేదనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube