టమాటా సాగులో అధిక దిగుబడినిచ్చే మేలు రకం విత్తనాలు ఇవే..!

టమాటా పంట( Tomato cultivation )ను సంవత్సరం పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.కాకపోతే అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం మరియు వడగాలులు ఎక్కువగా ఉంటే టమాటా మొక్కల పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉండదు.

 These Are The Best Varieties Of Seeds That Give High Yield In Tomato Cultivation-TeluguStop.com

కాబట్టి ఏడాదిలో ఏ కాలంలో సాగుచేసిన అధిక దిగుబడి సాధించాలంటే ముందుగా మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.ఉష్ణోగ్రతను తట్టుకొని పెరగగలిగే విత్తనాలే అధిక దిగుబడినిస్తాయి.

పూసా ఎర్లీడ్వార్ఫ్

: ఈ రకం వర్షాకాలం మరియు వేసవికాలంలో సాగుకు చాలా అనుకూలం.నాటిన 60 రోజుల్లో పంట కాపు కు వస్తుంది.

ఈ రకం పంట కాలము 120 నుంచి 130 రోజులు.ఒక ఎకరంలో దాదాపుగా 12 టన్నుల దిగుబడి పొందవచ్చు.

Telugu Agriculture, Arka Saurabh, Pkyam, Pusa Earlydwarf, Pusa Ruby, Seeds, Toma

పూసా రూబీ

🙁 Pusa Ruby 0ఏడాది పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.నాటిన 65 రోజుల లోపు పంట చేతికి వస్తుంది.ఈ రకం పంట కాలం 130 నుంచి 135 రోజులు.ఒక ఎకరం పొలంలో 12 టన్నులకు పైగా దిగుబడి పొందవచ్చు.

పి.కె.యం.1

: ఈ రకాన్ని ఏడాది పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.నాటిన 60 రోజులలోపు పంట కోతకు వస్తుంది.ఈ పంట కాల పరిమితి 130 నుంచి 135 రోజులు.ఒక ఎకరం పొలంలో దాదాపుగా పది నుంచి 12 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.

అర్క వికాస్

: ఈ రకం వేసవి కాలానికి అనుకూలంగా ఉంటుంది.వేసవిలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రకం సాగు చేయడం ఉత్తమం.ఈ రకం పంట కాలపరిమితి 100 నుంచి 110 రోజులు.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 16 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.

Telugu Agriculture, Arka Saurabh, Pkyam, Pusa Earlydwarf, Pusa Ruby, Seeds, Toma

అర్క సౌరభ్

🙁 Arka Saurabh ) ఈ రకం శీతాకాలం మరియు వేసవికాలంలో సాగుకు చాలా అనుకూలం.ఈ రకం పంట కాలపరిమితి 100 నుంచి 110 రోజులు.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 14 టన్నుల దిగుబడి పొందవచ్చు.

పూసా సదా బహర్

🙁 Pusa Sada Bahar ) ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల నుండి 30 డిగ్రీల మధ్య ఉండే వాతావరణంలో ఈ రకం సాగు చాలా అనుకూలం.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 10 నుంచి 14 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube