ఈ లిప్ బామ్ వాడితే మీ పెదాలు గులాబీ రంగులోకి మార‌డం ఖాయం!

పెదాలు గులాబీ రంగులో ఉంటే ముఖం మ‌రింత అందంగా క‌నిపిస్తుంది.అందుకే దాదాపు అంద‌రూ త‌మ లిప్స్ పింక్ క‌ల‌ర్‌లో ఉండాల‌ని కోరుకుంటుంటారు.

కానీ, ఆహార‌పు అల‌వాట్లు, శ‌రీరంలో అధిక వేడి, ఎండ‌ల ప్ర‌భావం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే లిప్ స్టిక్స్‌ను యూజ్ చేయ‌డం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, మృత క‌ణాలు పేరుకు పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పెదాలు న‌ల్ల‌గా మారిపోతుంటాయి.దాంతో లిప్స్ యొక్క డార్క్‌నెస్‌ను ఎలా వ‌దిలించుకోవాలో తెలీక తెగ మ‌దన ప‌డిపోతూ ఉంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే లిప్ బామ్‌ను వాడితే గ‌నుక న్యాచుర‌ల్‌గానే మీ పెదాలు గులాబీ రంగులోకి మార‌తాయి.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ లిప్ బామ్ ఏంటో.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.? చూసేయండి.ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు దాల్చిన చెక్క‌లు వేసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పొడిని జ‌ల్లించుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వాసెలిన్, రెండు స్పూన్ల దాల్చిన చెక్క పౌడ‌ర్‌, వ‌న్ స్పూన్‌ కొకొన‌ట్ ఆయిల్ వేసి డ‌బుల్ బాయిల‌ర్ మెథ‌డ్‌లో రెండు నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి.

Advertisement

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ఒక బాక్స్‌లో నింపుకుని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే లిప్ బామ్ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ లిప్ బామ్‌ను రోజుకు రెండు లేదా మూడు సార్లు పెదాల‌కు అప్లై చేయాలి.ఇలా చేస్తే డార్క్ లిప్స్ పింక్‌గా, గ్లోయింగ్‌గా మార‌తాయి.అలాగే చాలా మంది పెదాల ప‌గుళ్ల‌తో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతుంటారు.

అలాంటి వారు కూడా ఈ లిప్ బామ్‌ను యూజ్ చేయ‌వ‌చ్చు.ఈ న్యాచుర‌ల్ లిప్ బామ్‌ను వాడితే లిప్స్ ఎక్కువ స‌మ‌యం పాటు హైడ్రేటెడ్‌గా ఉంటాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు